Asianet News TeluguAsianet News Telugu

మంత్రులు, ఎంఎల్ఏల్లో పెరిగి పోయిన బిపి

  • చంద్రబాబునాయుడు పెద్ద టార్గెట్ నే ఫిక్స్ చేశారు.
  • పలువురు మంత్రులు, ఎంఎల్ఏలను సోమవారం ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ టార్గెట్ పిక్స్ చేశారు.
Naidu targets all 175 segments in the coming elections

చంద్రబాబునాయుడు పెద్ద టార్గెట్ నే ఫిక్స్ చేశారు. పలువురు మంత్రులు, ఎంఎల్ఏలను సోమవారం ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ టార్గెట్ పిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అన్నీ అంటే 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాల్సిందేనంటూ స్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా వెనకబడ్డా, ఎన్నికల్లో ఓడినా వాళ్ళ రాజకీయ జీవితం అక్కడి తో అయిపోయినట్లేనట. గెలవని, గెలిపించని వారి రాజకీయ జీవితం అక్కడితో ముగిసినట్లేనని స్పష్టంగా ప్రకటించటంతో మంత్రులు, ఎంఎల్ఏల్లో ఆందోళన మొదలైంది.

ఇంతకీ అసలు చంద్రబాబు ఒక్కసారిగా అంతలా ఫైర్ అవ్వటానికి కారణం ఏంటి? అంటే, సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా పలువురు మంత్రులు, ఎంఎల్ఏలను తన ఛాంబర్ కు పిలిపించుకున్నారు. సిఎం పిలుస్తున్నారని చెప్పగానే మంత్రులు, ఎంఎల్ఏలు హడావుడిగా ముఖ్యమంత్రి చాంబర్ కు చేరుకున్నారు. వారేదో ఊహించుకుంటే అక్కడింకేదో జరిగింది. ఇంతకీ సిఎం చాంబర్లో ఏం జరిగింది? పలువురు మంత్రులు, ఎంఎల్ఏలపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఫుల్లుగా ఫైర్ అయ్యారు.

ప్రతిపక్ష వైసిపి అసెంబ్లీని బహిష్కరించినా అధికారపార్టీ ఎంఎల్ఏలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని చంద్రబాబు అప్పట్లో చాలా గొప్పగా చెప్పారు. తీరా చూస్తే, సమావేశాలు బాగా చప్పగా సాగుతున్నాయి. కారణమేంటంటే, అసెంబ్లీలో వైసిపి లేకపోతే బాగా లేదని టిడిపి సభ్యులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో ఎటూ ప్రతిపక్షం లేదన్న ఉదాసీనత కూడా వారిలో పేరుకుపోయింది. అందుకే సభలో మంత్రులు, ఎంఎల్ఏల హాజరు పెద్దగా ఉండటం లేదు. దాంతో చంద్రబాబుకు మండిపోయింది.

దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలను తన చాంబర్ కు పిలిపించుకుని సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై సీరియస్‌నెస్ లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రానివాళ్లను వెంటనే పిలిపించాలని సీఎం తన సిబ్బందిని ఆదేశించారు. నాలుగు రోజులు సెలవులు ఇచ్చినా నిర్లక్ష్యమైతే ఎలా? అంటూ మండిపడ్డారు. నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొని వెళ్లండని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికలంటూ టార్గెట్ ఫిక్స్ కూడా చేసేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios