Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) రానున్న 12 నెలల్లో 500 ఐటి కంపెనీలు

  • విశాఖపట్నం మెగా ఐటీ సిటీగా, అమరావతి మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు అందించారు.
  • ప్రజంటేషన్ అనంతరం ఏపీలో సంస్థల ఏర్పాటుకు 450 మంది ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు.
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో 100 అవగాహన ఒప్పందాలకు సిద్ధం ఎన్ఆర్ఐలు సిద్దపడ్డారు.
Naidu targeting 500 IT industries in next 12 months

రానున్న 12 మాసాలలో విజయవాడ, విశాఖపట్నం నగరాలలో 500 ఐటి సంస్ధలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబునాయుడు. ఈ ఐటీ సంస్థలకు అవసరమైన కార్యాలయ వసతిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.  బుధవారం అమెరికా పర్యటన మొదలుపెట్టిన చంద్రబాబు పలు ఐటి సంస్ధల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి 80కి పైగా ఐటీ సంస్థల నిర్వాహకులు సమావేశంలో పాల్గొన్నారు.

ఐటీ సిటీపై చంద్రబాబుకు ఐటీ టాస్కుఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం మెగా ఐటీ సిటీగా, అమరావతి మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు అందించారు. ప్రజంటేషన్ అనంతరం ఏపీలో సంస్థల ఏర్పాటుకు 450 మంది ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో 100 అవగాహన ఒప్పందాలకు సిద్ధం ఎన్ఆర్ఐలు సిద్దపడ్డారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సంస్థలను నెలకొల్పడానికి 60 కంపెనీలు ముందుకొచ్చాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే  8వేల మందికి ప్రత్యక్షంగాను 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి.

Naidu targeting 500 IT industries in next 12 months

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే నెలలో బిల్, మిలిందా గేట్స్ ఏపీకి వస్తున్నారని చెప్పారు. వారి పర్యటన రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులకు మంచి ఊతం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. మనమంతా ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలన్నారు.

అదే సమయంలో అమెరికా సమాజానికి కూడా తోడ్పాటునందించాలన్నారు. అవకాశం ఇచ్చిన ఆతిధ్య దేశాన్ని మరవకూడదన్నారు. ఇక్కడున్న ప్రతి ఐటీ ఉద్యోగి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని కోరారు. ఉద్యోగంతోనే సంతృప్తి పడకుండా మీరే మరికొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి సంపద సృష్టించే స్థాయికి ఎదగాలన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రగామిగా ఉంది.  మీరు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇచ్చారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిరోజు పర్యటనలో ఐటీ సర్వీసులు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, సాఫ్టువేర్ ప్రోడక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ సర్విసెస్, ఎమర్జెంగ్ టెక్నాలజీస్ విభాగాలలో కంపెనీలు నెలకొల్పడానికి ముందుకొచ్చిన సంస్థలు. తర్వాత చంద్రబాబుతో సెల్ఫీలు దిగడానికి ప్రవాసాంధ్రులు పోటీ పడ్డారు.  

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios