Asianet News TeluguAsianet News Telugu

పార్టీ నుండి అవుట్

బ్యాంకు రుణాలను ఎగొట్టిన నేరంపై సిబిఐ దాడులు జరగ్గానే నెల్లూరు ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. అటువంటిది దీపక్ పైన మాత్రం చంద్రబాబు ఏం చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంలోనే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Naidu suspended mlc deepakreddy from the party

అనంతపురం ఎంఎల్సీ దీపక్ రెడ్డిని చివరకు సస్పెండ్ చేసారు. హైదరాబాద్ లో భూకబ్జా కేసుల్లో దీపక్ ను పోలీసులు అరెస్టు చేసారు. ప్రస్తుతం దీపక్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. 2009 ఎన్నికల్లోనే జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో పోటీ చేసిన దీపక్ తన అఫిడవిట్లో రూ. 6756 కోట్ల ఆస్తులు చూపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అంత ఆస్తులను అఫిడవిట్లో చూపించిన రాజకీయ నేతలు అప్పటి వరకూ ఎవరూ లేకపోవటమే అందుకు కారణం.

అప్పటి నుండి అడపదడపా వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీపక్ రాజకీయ నేపధ్యం అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి మేనల్లుడు, తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడవ్వటమే. తన రాజకీయ నేపధ్యాన్ని అడ్డుపెట్టుకునే యధేచ్చగా భూక్బాలకు పాల్పడ్డారు.

ఇటీవలే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో పట్టుబట్టి మరీ అనంతపురం జిల్లాలోని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే వెంటనే కబ్జా ఆరోపణలపై అరెస్టయ్యారు. అప్పటి నుండి దీపక్ ను ఎందుకు సస్పెన్షన్ విషయం పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.

బ్యాంకు రుణాలను ఎగొట్టిన నేరంపై సిబిఐ దాడులు జరగ్గానే నెల్లూరు ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. అటువంటిది దీపక్ పైన మాత్రం చంద్రబాబు ఏం చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంలోనే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ప్రతిపక్షాలు కూడా విరుచుకు పడుతున్నాయి. చివరకు అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకే చివరకు చంద్రబాబు పార్టీ నుండి దీపక్ ను సస్పెండ్ చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios