రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ఏ విధంగానూ రక్షించటం లేదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. చంద్రబాబు ఏమీ సాధించలేరన్న సంగతి ప్రజలకూ అర్ధమైపోయింది. కాకపోతే వచ్చే ఎన్నికల వరకూ నాటకాన్ని రక్తికట్టించాలి కదా? అందుకే కేంద్రమైనా, చంద్రబాబైనా ఎవరి పాత్రలు వారు పోషిస్తున్నారు.

మరీ ఇంత దేబిరింపా? ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతోంది. రెండేళ్ళలో షెడ్యూల్డ్ ఎన్నికలు. ఏడాది ముందుగానే ఎన్నికలంటున్నారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కోసం చంద్రబాబునాయుడు ఇప్పటికీ కేంద్రం కాళ్ళు గడ్డాలు పట్టుకుంటూనే ఉన్నారు.

ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తున్న వాళ్ళ నోళ్ళును దబాయించి మూయిస్తున్న చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్ళేటప్పటికి మాత్రం ప్రాదేయపడుతున్నారు. రాష్ట్రంలో ఏమో హోదాకు మించే కేంద్రం సాయం చేస్తోందని చెబుతూనే, ఢిల్లీకి వెళ్లి ‘ఇచ్చిన హామీలను అమలు చేయండి మహాప్రభో’ అంటూ సాగిలపడుతుండటం గమనార్హం.

తాజాగా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలిసారు. రాష్ట్రానికి రావాల్సిన వాటని గట్టిగా అడిగి సాధించుకోవాల్సిందిపోయి బాబ్బాబు..బాబ్బాబు అంటూ బ్రతిమాలాడుకోవటం గమనార్హం. ‘ప్యాకేజి ఇస్తామని రెండేళ్ల కిందట చెప్పారు’. ‘ప్రత్యేకహోదాతో సమానంగా లబ్ది కలగచేస్తామన్నారు’. ‘హోదా వల్ల వచ్చే లాభమేమిటో ఇప్పటివరకు తేల్చనేలేద’ ని జైట్లీని వేడుకున్నారు. 2015 ఏప్రిల్ తర్వాత కుదిరిన విదేశీ ఆర్ధిక సహాయంతో (ఈఏపి)చేపట్టే ప్రాజెక్టుల రుణభారాన్ని మాత్రమే కేంద్రం భరిస్తే కష్టమని చంద్రబాబు చెప్పుకున్నారు.

అంతుకుముందు ప్రభుత్వాలు చేసిన రుణాలను కూడా కేంద్రమే భరించాలంటూ వేడుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామలను చంద్రబాబు జైట్లీకి గుర్తు చేసారట. ఆయనా తలూపి ఊరుకున్నారట. భలేగుంది కదూ వీరి సమావేశం.

పై వివరాలు చాలు కేంద్రం దృష్టిలో చంద్రబాబు పరిస్ధితి ఏమిటో తెలుసుకోవటానికి. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ఏ విధంగానూ రక్షించటం లేదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. చంద్రబాబు ఏమీ సాధించలేరన్న సంగతి ప్రజలకూ అర్ధమైపోయింది. కాకపోతే వచ్చే ఎన్నికల వరకూ నాటకాన్ని రక్తికట్టించాలి కదా? అందుకే కేంద్రమైనా, చంద్రబాబైనా ఎవరి పాత్రలు వారు పోషిస్తున్నారు.