ఆస్తులెక్కువున్నంత మాత్రానా డ్రగ్స్ లాంటి దురలవాట్లు ఎలా వస్తాయని చంద్రబాబు ఎలా నిర్ధారించారో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, ఆస్తులెక్కువగా ఉన్నవారు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నారా?ఆస్తులన్న వారందిరికీ డ్రగ్స్ వాడే అలవాటుంటుందా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిందే నిజమైతే రాష్ట్రంలోని చాలామంది ప్రముఖుల పిల్లలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సుటుంది.  ఎక్సైజ్ శాఖ అధికారులకు   పూర్తి అధికారాలను కట్టబెడితే చాలు బెల్టుషాపుల వ్యాపారం దానంతట అదే నియంత్రణలోకి వస్తుంది.

‘ఆస్తులు ఎక్కువైతే దురలవాట్లే వస్తాయి..అందుకు నిదర్శనమే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం’..ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. కుప్పం పర్యటనలో గురువారం ఆయన మాట్లాడుతూ, బెల్టుషాపులు ఎక్కుడున్నా ఉపేక్షించేదిలేదని స్పష్టం చేసారు. ఆస్తులెక్కువైతే డ్రగ్స్ వాడకం లాంటి దురలవాట్లు వస్తాయని చెప్పిన మాటలపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆస్తులెక్కువున్నంత మాత్రానా డ్రగ్స్ లాంటి దురలవాట్లు ఎలా వస్తాయని చంద్రబాబు ఎలా నిర్ధారించారో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, ఆస్తులెక్కువగా ఉన్నవారు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నారా?

తెలంగాణాలో హైదరాబాద్ మినహా ఇంకెక్కడా ఆస్తలున్న వారే లేరా? పోనీ 13 జిల్లాల ఏపిలో ఆస్తులున్న వారు లేరా? డ్రగ్స్ వాడకానికి ఆస్తులు ఎక్కువుగా ఉండటానికి ఏంటి లింక్ అసలు? ఆస్తులన్న వారందిరికీ డ్రగ్స్ వాడే అలవాటుంటుందా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిందే నిజమైతే రాష్ట్రంలోని చాలామంది ప్రముఖుల పిల్లలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సుటుంది.

ఇక, బెల్టుషాపుల విషయం మాట్లాడుతూ, బెల్టుషాపులు ఎక్కుడున్నా ఉపేక్షించేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేసారు. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు బెల్టుషాపుల విషయంలో ఇటువంటి ప్రకటనలు చాలానే చేసారు. బెల్టుషాపుల రద్దుకు ఇప్పటి వరకూ ఏకంగా రెండుసార్లు ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా? ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 48 వేల బెల్టుషాపులున్నాయంటే చంద్రబాబు ఆదేశాలు ఎంత దివ్యంగా అమలవుతున్నాయో అర్ధమైపోతోంది.

అయినా ప్రతీ బెల్టుషాపు వెనుక అధికారపార్టీ నేతలే ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్న విషయం చంద్రబాబు దృష్టికి రాలేదా? సరే, అధికారంలో ఎవరుంటే బెల్టుషాపుల్లో వారి షేరే ఎక్కువుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అనుకోండి. బెల్టుషాపుల వ్యాపారం నుండి ముందు టిడిపి నేతలను దూరంగా ఉంచి, ఎక్సైజ్ శాఖ అధికారుల అధికారులకు పూర్తి అధికారాలను కట్టబెడితే చాలు బెల్టుషాపుల వ్యాపారం దానంతట అదే నియంత్రణలోకి వస్తుంది. అయినా రాష్ట్రంలో ఎన్నికలఫీవర్ మొదలైపోయింది కదా ఇంకెన్ని మాటలు వినాల్సొస్తుందో భవిష్యత్తులో?