వైసీపీ అధినేత తప్పు చేసాడు కాబట్టి ఏనాటికైనా శిక్ష తప్పదు. సరే అదే నిజమనుకుందాం. ఎందకంటే, తప్పు చేసిన వారిని శిక్షించవద్దని ఎవరూ చెప్పరు కదా? మరి చేసిన తప్పుకు శిక్షపడటం అన్నది ఒక్క జగన్ కు మాత్రమేనా? లేక తప్పెవరు చేసినా శిక్ష పడాల్సిందేనా? ప్రతీ ఒక్కరికీ శిక్ష తప్పదనుకుంటే మరి, చంద్రబాబుకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా?
‘వైసీపీ అధినేత తప్పు చేసాడు...శిక్ష తప్పదు. అది ఈవాళ కాకపోతే రేపు..అంతే. శిక్షను మాత్రం తప్పించుకోలేరు’..ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. మంగళవారం జరిగిన టిడిపి వర్క్ షాపులో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతిపక్షంలో నాయకత్వ శూన్యత ఉందన్నారు. ప్రతిపక్షంలో గట్టి పార్టీలే లేవన్నారు. వైసీపీ అధినేత తప్పు చేసాడు కాబట్టి ఏనాటికైనా శిక్ష తప్పదని తేల్చేసారు.
వైసీపీ అధినేత తప్పు చేసాడు కాబట్టి ఏనాటికైనా శిక్ష తప్పదు. సరే అదే నిజమనుకుందాం. ఎందకంటే, తప్పు చేసిన వారిని శిక్షించవద్దని ఎవరూ చెప్పరు కదా? మరి చేసిన తప్పుకు శిక్షపడటం అన్నది ఒక్క జగన్ కు మాత్రమేనా? లేక తప్పెవరు చేసినా శిక్ష పడాల్సిందేనా? ప్రతీ ఒక్కరికీ శిక్ష తప్పదనుకుంటే మరి, చంద్రబాబుకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా?
‘ఓటుకునోటు’ కేసులో అధికారపార్టీ ఎంఎల్ఏల ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నంలో దొరికిపోయారు కదా? పాత్రదారులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు ఇప్పటికే రిమాండ్ కు వెళ్ళి బెయిలుపై బయట తిరుగుతున్నారు. మరి సూత్రదారుల సంగతేంటి? తనపై కేసు విచారణ జరగకుండా స్టే మీద కొనసాగుతున్న చంద్రబాబు పాత్రేమిటో అందరికీ తెలిసిందే.
కేసులో విచారణ ఎదుర్కోవటానికి సిద్దపడటం లేదన్నా, విచారణ కొనసాగకుండా అడ్డుపడుతున్నా ఇక్కడ మ్యాటరేంటో క్లియర్ గా అర్ధమైపోతోంది అందరికీ. అంటే చంద్రబాబు కూడా తప్పుచేసినట్లే కదా? ఆయన మాటలను బట్టి చూస్తే చంద్రబాబుకు కూడా శిక్ష తప్పదనే కదా అర్ధం? గురివిందగింజ పద్దతిలో తనక్రింద తప్పులు పెట్టుకుని ఎదుటివారి తప్పులు మాత్రమే ఎత్తి చూపటంలో అర్ధమేంటి?