కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత రూ. 22 కోట్లకన్నా రూ. 5 కోట్లు అదనంగా చెల్లించేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే భూములను ఇవ్వాలంటూ కోర్టు చెప్పింది. కోర్టు చెప్పినట్లే ఆళ్ళ రూ. 27 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. సరే భూములు చేజారిపోతున్నాయన్న అక్కసు నారా లోకేష్ మాటల్లో తెలిసిపోతోంది. అయితే, కోర్టు తీర్పు కావటంతో ఏమీ చేయలేక 84 ఎకరాలను వదిలేసుకోవటం తప్ప చంద్రబాబుకు వేరే దారిలేదు.
వ్యవస్ధల మీద చంద్రబాబునాయుడుకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. అందులోనూ న్యాయవ్యవస్ధ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అటువంటి చంద్రబాబుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. సదావర్తి సత్రం భూముల విషయంలో మొదటిసారిగా చంద్రబాబుకు దిమ్మతిరిగింది. అదికూడా వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి నుండి కావటం ఇక్కడ గమనించాలి. దశాబ్దాల నుండి చంద్రబాబుపై ఎన్నో కేసులు హైకోర్టు, సుప్రింకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబుపై ఉన్న కేసులు గనుక విచారణ జరిగివుంటే ఏమయ్యేదో చెప్పలేం. మొదటిసారి ముఖ్యమంత్రైనపుడే పలు కేసులు కోర్టుకెక్కాయి. అయితే అవేవీ విచారణ జరగకుండా స్టేలపైనే ఆగిపోయాయి. పదేళ్ళ విరామం తర్వాత మూడోసారి ముఖ్యమంత్రైన వెంటనే నమోదైన ‘ఓటుకునోటు’ కేసు విచారణ జరిగివుంటే ఏం జరిగేదో. ప్రతీ కేసులోనూ న్యాయస్ధానం క్లీన్ చిట్ ఇచ్చిందని చంద్రబాబుతో పాటు టిడిపి వాళ్ళు చెప్పుకుంటారునుకోండి అదివేరే సంగతి. ఏ కేసులోనూ చంద్రబాబుకు క్లీన్ చిట్ రాలేదని ప్రతిపక్షాలూ చెబుతుంటాయి.
ప్రస్తుతానికి వస్తే సదావర్తి భూములను ఏకపక్షంగా సొంతం చేసుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సొంతం చేసేసుకున్నారు కూడా. అయితే, వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ అడ్డుపడ్డారు. వందల కోట్ల విలువైన భూములను ఏకపక్షంగా తన మద్దతుదారుడు రామానుజయ్యకు కట్టబెట్టటం తగదంటూ ఆళ్ళ కోర్టుకెక్కారు. కోర్టు తీగ కదపటంతో డొంకంతా కదిలింది. రూ. 22 కోట్లకే రామానుజయ్యకు 84 ఎకరాలను కట్టబెట్టటం వెనుక ప్రభుత్వానికున్న దురుద్దేశ్యం బయటపడింది.
సరే, కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత రూ. 22 కోట్లకన్నా రూ. 5 కోట్లు అదనంగా చెల్లించేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే భూములను ఇవ్వాలంటూ కోర్టు చెప్పింది. కోర్టు చెప్పినట్లే ఆళ్ళ రూ. 27 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. సరే భూములు చేజారిపోతున్నాయన్న అక్కసు నారా లోకేష్ మాటల్లో తెలిసిపోతోంది. అయితే, కోర్టు తీర్పు కావటంతో ఏమీ చేయలేక 84 ఎకరాలను వదిలేసుకోవటం తప్ప చంద్రబాబుకు వేరే దారిలేదు. ఇప్పటికే రాజధాని భూముల విషయంలో సుప్రింకోర్టు అక్కడక్కడ రైతులకు అనుకూలంగా తీర్పులు చెప్పినా సదావర్తి భూముల విషయంలోనే చంద్రబాబుకు పెద్ద దెబ్బ తగిలినట్లు లెక్క.
