పర్యటనలో సిఎం పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఆహార సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ అయ్యారు. అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ మాగ్నా ఇంటర్నేషనల్ ఏపీకి వచ్చి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. 

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు బృందం దుబాయ్ చేరుకున్నది. మూడు రోజుల పాటు చంద్రబాబు అమెరికాలో పర్యటించిన సంగతి అందరకీ తెలిసిందే. తన పర్యటనలో సిఎం పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఆహార సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ అయ్యారు. అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ మాగ్నా ఇంటర్నేషనల్ ఏపీకి వచ్చి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. 

ఇదే సమావేశంలో పాల్గొన్న నీతిఅయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా మాట్లాడుతూ, భారత్ లో రాష్ట్రం ‘ఏపీ హ్యాపెనింగ్ స్టేట్’ గా అభివర్ణించారు. తాను నీతిఆయోగ్ ఉపాధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగిందని అన్నారు.

అదే సమావేశంలో అమరావతిలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నలందా 2.0 సంస్థ సంసిద్ధత తెలియజేసింది. తొలి 25 ప్రపంచ ర్యాంకులలో ఒకటిగా నిలిచేలా అమరావతిలో వరల్డ్ క్లాస్ యూనివర్శిటీ ఏర్పాటుకు సుముఖంగా వున్నామని నలందా వ్యవస్థాపక అధ్యక్షుడు షాయిల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.

ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్రప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్లిల్లించ్ లో వెనెక్లేశన్ అసోసియేట్స్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ డా. మహావీర్ అత్వాల్ , యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ అఘీ తదితరులు పాల్గొన్నారు.