ప్రతి పార్కు ఇక హ్యాపీనెస్ సెంటర్‌. అందులో ఫిట్‌నెస్ సెంటర్ . నిరుద్యోగులకు తోట పని,పెస్టుమెనేజ్ మెంట్ లో శిక్షణ
ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు భారీ పథకం మొదలుకాబోతున్నది. అది వూరూర ఉద్యానవనం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆయన ఒక పెద్ద ఉద్యానవనం చేయాలనుకుంటున్నారు. ప్రతినగరాన్ని స్థానిక ప్రాముఖ్యాన్ని బట్టి సుందరమయిన ఉద్యానవన నగరంగా మార్యాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో చాలా ఉద్యోగాలు వస్తాయి.
ఉదాహరణకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండను తీసుకోండి. అక్కడ అమ్మవారికి ఇష్టమైన పసుపు, ఎర్ర వర్ణం గల పుష్పజాతులతో అందమైన పూదోటను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
శ్రీశైలం కొండ మార్గంలో పాదచారుల కోసం ఆకర్షణీయంగా వుండేలా ఇపుడు ప్రాముఖ్యం కోల్పోయిన నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచనలిచ్చారు.
విజయవాడను కాలువల నగరంగా, తిరుపతిని సరస్సుల నగరంగా, విశాఖను బీచ్ నగరంగా... ఇలా ఆంధ్ర రాష్ట్ర నగరాలన్నింటినరి మరింత సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటకులను పెద్ద ఎత్తున అకర్షించే తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు.
దాని ఉపగ్రహా సమాచారాన్ని మార్గదర్శకంగా తీసుకుంటారు.
ఇస్రో అందించే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పట్టణాలు, నగరాల్లో గ్రీనరీని ఎప్పటికప్పుడు అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రతి పార్కును ఇక హ్యాపీనెస్ సెంటర్గా తీర్చిదిద్దాలని, ఇందులో ఒక ఫిట్నెస్ సెంటర్లను వెంటనే ఏర్పాటుచేయాలని కూడా ఆయన ఆదేశించారు.
పచ్చిక బయళ్లు, తోటలు, పెరటి చెట్లు, మొక్కల పెంపకం, ఇంటి ఆవరణలో చెట్లు, గృహాలంరణలో భాగంగా పెంచే చెట్లు, బోన్సాయ్ వృక్షాలు, నర్సరీలు, రూఫ్ గార్డెన్లు, వర్టికల్ గార్డెన్లు, ఫ్లోరీ కల్చర్, ఇరిగేషన్, పెస్టు మేనేజ్మెంట్ తదితర అంశాలలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు తయారుచేయాలని చెప్పారు.
ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్’ చేపట్టిన పనుల ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో వున్న బహి చేపట్టిన సుందరీకరణ పనుల గురించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
