రాష్ట్ర శాసనసభ భవంతిని రాజధానికే తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల విస్తీర్ణాన్నికేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాల కోసమే వదిలిపెడతారు.సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తులతో కనీసం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుంది. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా వుండేలా సచివాలయ నిర్మాణం చేపడతారు.
రాజధాని అమరావతిలో ప్రపంచంలో నై పెద్ద దయిన అసెంబ్లీ, ఎత్తయిన సచివాలయం రాబోతున్నాయి.
రాష్ట్ర శాసనసభ భవంతిని రాజధానికే తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల విస్తీర్ణాన్నికేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాల కోసమే వదిలిపెడతారు. మొత్తం నగరానికే వన్నె తెచ్చేలా మన కొత్త శాసనసభ భవంతి నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు సూచించినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు. ఈ మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు.
అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90 శాతం పూర్తయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈనెల 12 నుంచి 16 వరకు లండన్‌లో ఆకృతులపై జరిగిన కార్యగోష్టిలో పాల్గొన్నామని తెలిపారు. ముఖ్యంగా శాసనసభ కట్టడం, ప్రజారవాణా వ్యూహం, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో విపులంగా చర్చించామని చెప్పారు. ఈనెల 22న ఫోస్టర్ బృందం మలి విడత ఆకృతుల్ని అందిస్తుందని అన్నారు. క్రిస్ బెర్గ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఆకృతుల్ని పరిశీలించి ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు అందిస్తే వాటిని పొందుపరుస్తూ తుది ఆకృతులు సిద్ధం చేసి అందిస్తారని చెప్పారు.
సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తులతో కనీసం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుంది. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా వుండేలా సచివాలయ నిర్మాణం చేపడతారు . రాష్ట్ర సచివాలయ భవంతి చూడ్డానికి బాగుండటమే కాకుండా పని చేసే వాతావరణం ఉట్టిపడేలా జల, హరిత ఆకర్షణలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు.
ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందిస్తున్న ప్రజా రవాణా ప్రణాళిక రానున్న కాలపు అవసరాలకు తగినట్టుగా వుండేలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ హైపర్ లూప్ తరహా వినూత్న రవాణా వ్యవస్థలు తెర ముందుకు వస్తున్నాయని చెబుతూ, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని ప్రణాళికను రూపొందించేలా ఫోస్టర్ బృందానికి సూచించాలని అన్నారు.
