పులివెందులలో జగన్ ఓటమికి చంద్రబాబు పక్కా స్కెచ్

పులివెందులలో జగన్ ఓటమికి చంద్రబాబు పక్కా స్కెచ్

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టిడిపిని గెలిపించుకునేందుకు చంద్రబాబునాయుడు భారీ స్కెచ్చే వేస్తున్నారు. పులివెందుల..వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటన్న విషయం అందరకీ తెలిసిందే. ఆ నియెజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి ఓటమన్నదే లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధే గెలవాలని చంద్రబాబు బాగా పట్టుదలతో ఉన్నారు. అందుకని కొందరు నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జగన్ ను నాలుగు వైపులా రాజకీయంగా బిగించేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. పులెవెందులలో గెలిచే విషయమై కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పులివెందుల ఇన్ చార్జి సతీష్ రెడ్డి, ఎంఎల్సీ బిటెక్ రవి, పార్టీ శిక్షణా కేంద్రం డైరెక్టర్  రాం భూపాల్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. టిడిపి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవలంభించాల్సిన వ్యూహాలపై నేతలకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అభివృద్ధి పరంగా నియోజకవర్గానికి ఏం చేయాలో చేద్దామని తీర్మానించారు. అదే సమయంలో రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించారు. ‘ప్రభుత్వ పరంగా ఏం చేయాలో తాను చేస్తానని, పార్టీ పరంగా ఏం చేయాలో క్షేత్రస్ధయిలో మీరు పోరాటాలు చేయండి’ అంటూ ఆదేశించారు. నియోజకవర్గంలోని రైతులను ఆదుకునేందుకు సాగునీరివ్వనున్నట్లు సిఎం స్పష్టం చేసారు.

నియోజరవర్గానికి కావాల్సిన అన్నీ పనులు, పథకాలను అమలు చేద్దాం అంటూనే వాటిని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నేతలపై మోపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటంలో నేతలు వెనుకపడినట్లు అసంతృప్తి వ్యక్తం చేసారు. అంతర్గత విభేదాలతో పార్టీ బలోపేతానికి నేతలు ఇబ్బందిగా తయారైనట్లు మండిపడ్డారు. జగన్ ను ఓడించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుకోవద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. గండికోట నుండి చిత్రవతి రిజర్వాయర్ కు కృష్ణా జలాలను పంపింగ్ ద్వారా రైతులకు సాగు నీరిద్దామని చెప్పారు. అందుకోసం ఈనెలాఖరులో పులివెందులలోనే భారీ బహిరంగ సభ నిర్వహిచాలని కూడా నేతలకు స్పష్టం చేసారు.

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page