రెండు వేల కంటే రెండొందల నోట్లు తీసుకురావడం గురించి  అలోచించాలని మోదీకి లేఖ రాయనున్న బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొత్త ఆలోచన వచ్చింది. 

తను కోరినట్టు పెద్దనోట్ల రద్దు చేయకపోయినా, కనీసం మరొక కొత్త చిన్న నోటందించి ఆదుకోవాలని ఆయన ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అరు రోజులుగా దేశ మంతా బ్యాంకుల చుట్టు, ఎటిఎంల చుట్టూ తిరుగుతూ ఉండటం,చిన్న చిన్నవ్యాపారాలు ఛిన్నభిన్నం కావడం, చిరు వ్యాపారులు చితికి పోవడం చూశాక అయన మెరుపు లాంటి ఈ ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని నిన్నఅధికారులతో నోట్ల దారిద్య్ర నిర్మూలన గురించి అధికారులతో చర్చించారు.అందులో ఆయన ఒక చిన్న నోటు ప్రతిపాదన చేశారు. అదే రు.200 నోటు తీసుకురావడం.

రెండువేలనోట్ల సామాన్యుల కష్టాలు తీరకపోగా, రెట్టింపవుతాయని ఆయన గ్రహించారు. రెండువేల నోట్లు ఎలాగూ వచ్చాయి కాబట్టి వాటినేం చేయలేం. అందువల్ల రెండొందల నోట్లు అచ్చేస్తే అదిరిపోతుందనేది ఆయన సలహా.

ఇపుడు బడానోటు చేతిలో పడ్డవాళ్లంతా మనశ్శాంతి కోల్పోతున్నట్టు ముఖ్యమంత్రికి వేగుల వారు సమాచారం అందించారట. రైతుల, మారు బేరగాళ్లు, కిరాణాషాపుల వాళ్లు, తోపుడుబండోళ్లు కష్టాలు విన్నాక ఆయన మనసు కరిగిపోయి, దీనికొక పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించాక రెండొందల నోటు బ్రహ్మాస్త్రం అనిపించింది.

వెంటనే ఈ విషయం నిన్న జరిగిన అధికారుల సమావేశంలో ప్రకటించారు. అక్కడున్నవారంతా చప్పట్లు కొటేశారు.

ఇపుడొన్ననోట్ల అగచాట్ల నుంచి గట్టేక్కించేందుకు ఈ చిన్న నోటు పనికొస్తుంది, ఈ ప్రతిపాదన గురించి ఆలోచించాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ మేరకి ఆయన ప్రధానికి,ఎన్ డి ఎ నాయకత్వానికి ఒకటి రెండ్రోజుల్లో వివరంగా జాబు కూడా రాయాలనుకుంటున్నారట.