‘‘బాహుబలి సెట్టింగుల్లాంటి డిజైన్లే కావాలి’’.... రాజధాని నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ డిజైనర్లందరూ వెనక్కు తగ్గినట్లే. అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ ఆర్కిటెక్టులిచ్చిన డిజైన్లు ఏవీ చంద్రబాబునాయుడుకు నచ్చలేదు. బాహుబలి సినిమాలో దర్శకుడు రాజమౌళి వేసుకున్న సెట్టింగులే చాలా బాగున్నాయంటూ చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. బాహుబలి సెట్టింగులపై చంద్రబాబు మనసుపడ్డారు. దాంతో నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను పక్కన పెట్టేసారు.

అందుకనే మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులతో కలిసి రాజమౌళిని కలిసారు. చంద్రబాబు మనసులోని మాటను చెప్పారు. లండన్ వెళ్ళి నార్మన్ ఫోస్టర్ ను కలిసే విషయమై చర్చలు జరిపారు. ఎందుకంటే, రాజమౌళిని లండన్ తీసుకెళ్ళి ఆర్కిటెక్టును కలిపితే దర్శకుని సూచనల ప్రకారం ఫోస్టర్ డిజైన్లు గీస్తారట. ఈ మాత్రానికి ఫోస్టరే ఎందుకు? దేశంలో ఆర్కిటెక్టులే లేరా? వందల కోట్ల రూపాయల ఫీజెందుకు దండగ కదా? ఇప్పటికే డిజైన్ల పేరుతో అనేక మంది ఆర్కిటెక్టులకు వందల కోట్ల రూపాయలు సమర్పించుకున్నది ప్రభుత్వం. ఇపుడు కూడా ఫోస్టరిచ్చిన డిజైన్లను రాజమౌళికి చూపించి ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు. డిజైన్ల విషయంలో అంతర్జాతీయ ఆర్కిటెక్టుకు ఓ సినిమా దర్శకుడు సూచనలు చేయటం వినటానికే విచిత్రంగా లేదు...ఏం చేద్దాం..ఇలాగుంది చంద్రబాబునాయడు పరిపాలన.