చంద్రబాబువన్నీ ఉత్తరకుమారుని ప్రగల్బాలేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చేసారు.

ఏంచేస్తాం. చంద్రబాబునాయడు, టిడిపి నేతల తీరే అంత. ఎదుటి వారిని రెచ్చగొట్టటంలోను, గుడ్డకాల్చి మీదేయటంలోనూ వారికి మించిన వారు లేరు. అదే విషయాలను జగన్ ఇపుడు చెబుతున్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు చెబుతున్నవన్నీ అబద్దాలేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు సిఎం కాకమునుపే ప్రాజెక్టులు 80 శాతం పనులు పూర్తయిపోయినట్లు జగన్ చెప్పారు. మిగిలిన 20 శాతం పనులను కూడా మూడేళ్లల్లో సిఎం చేయలేకపోయినట్లు మండిపడ్డారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల్లో వేటిని కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు. శ్రీశైలంలో నీళ్ళున్నా రాయలసీమకు ప్రభుత్వం నీరు వదలటం లేదని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వటం ఇష్టంలేకే టిడిపి అసెంబ్లీని వాయిదా వేసిందని మండిపడ్డారు.

జూన్ నెలలోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపిలు రాజీనామాలు చేస్తారంటూ జగన్ మళ్ళీ ఇంకోసారి చెప్పారు. హోదాపై రాష్ట్రంలోని ప్రజలను జాగృత్తం చేస్తానన్నారు. తమను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కావాలనే పాత అంశాలను ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబువన్నీ ఉత్తరకుమారుని ప్రగల్బాలేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చేసారు.