తొమ్మిది రోజుల విదేశీ పర్యటనకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు బయలు దేరారు. ఆయన 26వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. అమెరికా, యూఏఈ, బ్రిటన్‌లలో ఆయన పర్యటిస్తారు.  ఈ నెల 21వరకు అమెరికా పర్యటనలో ఉంటారు. 21నుంచి 23వరకు యూఏఈలో పర్యటిస్తారు. బ్రిటన్‌లో 24నుంచి 26వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడే ఆయన రాజధాని డిజైన్ లను రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు. అమెరికా పర్యటనలో మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎంవో కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్‌ తదితరులు ఉంటారు. యూఏఈ, బ్రిటన్‌ పర్యటనలలో మునిసిపల్  మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొంటారు.ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధి కి అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు అమరావతి లో పారిశ్రామిక అభివృద్ధి కి పెట్టుబడులు పెట్టేందుకు సమకూర్చిన వసతులు గురించి కూడా ఆయన అయా దేశాల పారిశ్రామికవేత్తలకు వివరిస్తారు.