ఇద్దరు ప్రజాప్రతినిధులు గొడవలు పడటం దేనికి సంకేతాలంటూ మండిపడ్డారు. వీరిద్దరి గొడవ జిల్లా అంతటా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని తాను సహించనని, ఐయామ్ వెరీ సీరియస్ అని కూడా అన్నారట.
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్యాక్షన్ గొడవలపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం అర్ధారాత్రి దాటిన తర్వాత చిత్తూరు నేతలతో సమావేశమయ్యారు. అదే సమయంలో అద్దంకిలో ఎంఎల్సీ కరణం బలరాం-ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య గొడవలు జరగటం, కరణం మద్దతుదారులు ఇద్దరు మరణించటం చర్చకు వచ్చింది. ఘటనను చంద్రబాబే లేవనెత్తారు.
వైసీపీ నుండి గొట్టిపాటిని చేర్చుకన్నాం కాబట్టే సీనియర్ నేత కరణంకు ఎంఎల్సీగా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య రాజీ చేసిన తర్వాత సర్దుకుపోకుండా గొడవలు పడటంపై సీరియస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య గొడవలతో పార్టీని రోడ్డున పడేస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తని వ్యక్తం చేసారు. ఎన్నికలకు ఎంతో దూరం లేదు. అటువంటి సమయంలో కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గొడవలు పడటం దేనికి సంకేతాలంటూ మండిపడ్డారు. వీరిద్దరి గొడవ జిల్లా అంతటా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని తాను సహించనని, ఐయామ్ వెరీ సీరియస్ అని కూడా అన్నారట.
