ఏపికి ప్రత్యేకహోదా సాధనలో ప్రధాన అడ్డంకే టిడిపి అయినపుడు మిగిలిన పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత ఆందోళన చేసినా ఫలితం అనుమానమే.
మనవాళ్ల వాపు చూస్తుంటే, ‘పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్న’ సామెత గుర్తుకు వస్తోంది. లేకపోతే తమిళనాడును చూసి మనం స్పూర్తి పొందటమేమిటి? మనకు అంతటి స్పూర్తి పొందేంత సీనే ఉంటే ఏపికి ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక సాయం చేస్తామని అరుణ జైట్లీ ప్రకటన చేసిన నాడే కనబడేది. అంతెందుకు రాష్ట్ర విభజనలో పేర్కొన్న ‘ప్రత్యేక’ హామీల అమలుకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, సుజనాచౌదరి సిఎం చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు మాటలు మార్చారు, ఎన్ని పిల్లిమొగ్గులు వేసారు. అప్పుడు రాని ఆవేశం, ఇపుడు ఎందుకు?
తమిళులను చూసి ఆవేశపడితే ఉపయోగం లేదు. ఎందుకంటే, వారికి ఆవేశం, పట్టుదల మొదటి నుండి ఉన్నాయి. రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజకీయపార్టీలన్నీ ఏకమైపోతాయి. లేకపోతే జనాలు చీల్చి చెండాడేస్తారు. ఆ భయం ఉంది కాబట్టే నాయకులు అంత జాగ్రత్తగా ఉంటారు. మరి, మన రాష్ట్రంలో ఆ పరిస్ధతి ఉందా? సమైక్య రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కమిటిలో గానీ, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంచే కమిటిలో గానీ ఒక్క తెలుగు వాడున్నాడా? అప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇదే పద్దతిలో తమిళనాడు విషయంలో కేంద్రం వ్యవహరించేందుకు కనీసం ఆలోచేన చేయటానికి కూడా కేంద్రం సాహసం చేయలేందు.
ఒక సంప్రదాయ క్రీడ విషయంలోనే తమిళనాడు మొత్తం ఏకమైనపుడు ప్రత్యేకహోదా విషయంలో మనం ఏకం కాలేమా అన్న ప్రశ్న ఇపుడు వినబడుతోంది. మన ప్రయోజనాలను మనం కాపాడుకోవాలని, సాధించుకోవాలని ఇంకోరు చెప్పాలా? నిజంగా అది మనం సిగ్గుపడాల్సిన అశంమే. సరే, ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 26వ తేదీన విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్, తిరుపతిలోని ఎస్ వి యూనివర్సిటి, విజయవాడ బ్యారేజి దిగువ ప్రాంతాల్లో ప్రత్యేకహోదా సాధన కోసం ఉద్యమం మొదలుపెట్టాలని సోషల్ మీడియాలోవిస్తృతంగా ప్రచారంజరుగుతోంది.
మన రాష్ట్రానికి వస్తే అందరూ గమనించాల్సిన విషయమొకటుంది. అధికార పార్టీ ఎట్టి పరిస్ధితిలోనూ ప్రత్యేకహోదా కోసం మద్దతు ప్రకటించే ప్రశ్నేలేదు. గతంలో కూడా ప్రత్యేక డిమాండ్ తో ప్రతిపక్ష వైసీపీ ప్రజాందోళనలను చేపట్టింది. కాంగ్రెస్ కోటి సంతకాల ఉద్యమం చేసింది. అలాగే, రాజ్యసభలో ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును కూడా కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తనవంతుగా మూడు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ప్రతీదశలోనూ అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను హేళన చేస్తూనే ఉన్నారు.
కారణం చంద్రబాబునాయుడు కేంద్రంతో కుమ్మకయ్యారు. కుమ్మకయ్యారనేకన్నా వ్యక్తిగత అవసరాల కోసం సాగిలపడ్డారని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి మోడికేమో ప్రత్యేకహోదా ఇవ్వటం ఇష్టం లేదు. దాంతో చంద్రబాబు కూడా ఏమి మాట్లాడలేకున్నారు. ఏపికి ప్రత్యేకహోదా సాధనలో ప్రధాన అడ్డంకే టిడిపి అయినపుడు మిగిలిన పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత ఆందోళన చేసినా ఫలితం అనుమానమే.
