చంద్రబాబు నేరుగా ఫోన్లో వారితో మాట్లాడుతున్నారంటేనే ఏ చిన్న అవకాశాన్నీ చంద్రబాబు వదిలిపెట్టటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.
నంద్యాల ఉపఎన్నిక చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఉపఎన్నికలో గెలవటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ దగ్గరకు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నంద్యాలలో దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి బాగా సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి ద్వారా ప్రయత్నాలను తీవ్రం చేసారు.
భూమా మరణం తర్వాత, అంతకుముందు కూడా వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయస్ధాయి నేతలను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏవి ముగ్గురు నేతలను పార్టీలోకి తీసుకున్నారు. వారితో చంద్రబాబును స్పీకర్ ఫోన్లో మాట్లాడించారు. సరే, వారి వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే, చంద్రబాబు నేరుగా ఫోన్లో వారితో మాట్లాడుతున్నారంటేనే ఏ చిన్న అవకాశాన్నీ చంద్రబాబు వదిలిపెట్టటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.
