కోర్టు నిర్ణయించిన రూ. 5 కోట్లు అదనంగా రూ. 5 కోట్ల (27 కోట్లు) చెల్లించి భూములు తీసుకోవటానికి సిద్ధమంటూ ఈరోజు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు కూడా ఆళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం ఆళ్ళ వద్ద రూ. 27 కోట్లు కట్టించుకుని సదరు భూములను ఆళ్ళకు సొంతం చేయాలంటూ తీర్పు చెప్పింది. దాంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగింది.

సదావర్తి భూముల విషయంలో రాష్ట్రప్రభుత్వానికి చుక్కెదురైంది. గుంటూరు జిల్లాలోని సదావర్తిసత్రానికి రాష్ట్రంతో పాటు తమిళనాడులో కూడా భూములున్నాయి. మిగితా భూములు అన్యాక్రాంతమౌతున్నట్లే ఈ భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలు పావులు కదిపారు.

తమకు కావాల్సిన వారికి అత్యంత ఖరీదైన తమిళనాడులోని 84 ఎకరాలను కట్టబెట్టాలని అనుకున్నారు. రాజు తలచుకుంటే దేనికి కొదవ? అందుకే చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన కాపుకార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు కేవలం రూ. 22 కోట్లకే కట్టెబెట్టేసింది. అందుకు విచిత్రమైన వాదనలు వినిపించిందనుకోండి అది వేరే సంగతి.

ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేసారు. సరే, కేసన్నాక రెండు వైపులా వాదనలు ఉంటాయికదా? విచారణ సందర్భంగా కోర్టు ప్రభుత్వ వైఖరిపై బాగా తలంటింది. ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని తూర్పారబట్టింది. తామిచ్చిన భూములు రూ. 22 కోట్లకన్నా ఎక్కువ విలువ చేయదంటూ అడ్డంగా వాదించింది. ఆ విషయాన్నే కోర్టు ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన రూ. 22 కోట్లకు మించి రూ. 5 కోట్లు ఎక్కువిచ్చిన వారికే ఇచ్చేయాలంటూ తీర్పు చెప్పటంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఖంగుతిన్నది.

కోర్టు నిర్ణయించిన రూ. 5 కోట్లు అదనంగా రూ. 5 కోట్ల (27 కోట్లు) చెల్లించి భూములు తీసుకోవటానికి సిద్ధమంటూ ఈరోజు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు కూడా ఆళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం ఆళ్ళ వద్ద రూ. 27 కోట్లు కట్టించుకుని సదరు భూములను ఆళ్ళకు సొంతం చేయాలంటూ తీర్పు చెప్పింది. దాంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. ఎందుకంటే, ఆళ్ళ లెక్కల ప్రకారం సదరు భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 800 కోట్లుంటుంది. అంత విలువైన భూములను చంద్రబాబు తన మద్దతుదారులకు తేలిగ్గా కట్టబెడదామని అనుకున్నారు. ఆళ్ళ అడ్డుపడటంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.