గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఆదుకుంటున్న ఆదాయ మార్గాల్లో మద్యం ఆదాయం చాలా కీలకం. ఆబ్కారీ శాఖ నుండి ఏటా ప్రభుత్వానికి రూ. 13,581 కోట్లు వస్తోంది. అంత ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవటానికి సిద్ధంగా లేదు. అందుకనే సుప్రింకోర్టు ఆదేశాల్లోని లొసుగలను వెతికి మరీ బయటకు తీసింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోంది. మద్యం ఆదాయాన్ని కోల్పోవటం ఇష్టం లేకే రివర్స్ గేర్ వేసిందన్నది వాస్తవం. అంటే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకన్నా మద్యం ఆదాయమే ముఖ్యమని తేలిపోయింది. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తెవటమే చూసాం. అటువంటిది జాతీయ, రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా మార్చేయటం చంద్రబాబు జమానాలోనే చూస్తున్నాం.
మద్యం ఆదాయం కోసమే చంద్రబాబు రివర్స్ గేర్ వేసారని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న బార్లు, మద్యం షాపులను మూసేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది. సుప్రింకోర్టు చెప్పినట్లు బార్లు, మద్యం షాపులను ఎత్తేయాల్సింది పోయి జాతీయ, రాష్ట్రరహదారుల స్ధాయిని తగ్గించేసింది. అంటే సుప్రింకోర్టు చెప్పింది జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనున్న బార్లు, మద్యం షాపులను మాత్రమే మూసేయమంది.
సుప్రింకోర్టు ఆదేశాల్లోని లొసుగులను మాత్రమే చంద్రబాబు పట్టించుకున్నారు. సుప్రింకోర్టు బార్లు, మద్యం షాపులను ఎందుకు వద్దన్నది అన్న విషయాన్ని మాత్రం గాలికి వదిలేసారు. సుప్రింకోర్టు ఆదేశాలను ఎందుకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది? మద్యం ఆదాయం కోసమే అన్నది సింపుల్ ఆన్సర్. రాష్ట్ర విభజన తర్వాత అసలే ప్రభుత్వ ఖజానా చాలా ఇబ్బందుల్లో ఉంది.
గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఆదుకుంటున్న ఆదాయ మార్గాల్లో మద్యం ఆదాయం చాలా కీలకం. ఆబ్కారీ శాఖ నుండి ఏటా ప్రభుత్వానికి రూ. 13,581 కోట్లు వస్తోంది. అంత ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవటానికి సిద్ధంగా లేదు. అందుకనే సుప్రింకోర్టు ఆదేశాల్లోని లొసుగలను వెతికి మరీ బయటకు తీసింది. మద్యం ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఈ ఏడు ప్రభుత్వం మద్యం షాపులు, బార్ల సంఖ్యను పెంచింది. అదనంగా వెయ్యి కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.
సుప్రింకోర్టు తీర్పు వచ్చేనాటికి రాష్ట్రంలో 4770 మద్యం షాపులున్నాయి. అందులో 2118 షాపులు రాష్ట్ర హైవేలపైనే ఉండగా 1099 షాపులు జాతీయ హైవేలపైనున్నాయి. ఇక, రాష్ట్రంలోని 746 బార్లలో జాతీయ, రాష్ట్ర రహదారులపైనే 497 ఉన్నాయ్. వీటికి అదనంగా మంజూరు చేసిన మద్యం దుకాణాలు, బార్లను జనావాసాల మధ్య ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తే మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలతో అడ్డుకుంటున్నారు. దాంతో ఏం చేయాలో ప్రభుత్వానికి అర్దం కాక రహదారుల స్ధాయిని తగ్గించేసారు.
