మంత్రులు, ఎంఎల్ఏలపై చంద్రబాబు ఫైర్

మంత్రులు, ఎంఎల్ఏలపై చంద్రబాబు ఫైర్

అసెంబ్లీ సమావేశాల్లో కనబడని మంత్రులు, ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తాను లేకున్నా సమావేశాలకు హాజరుకావాల్సిందేనంటూ క్లాసు పీకినట్లు సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే,  బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు హాజరుకాలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ ప్రశ్నలు చదివినపుడు సమాధానాలు చెప్పటానికి మంత్రులు సభలో లేకపోవటంతో స్పీకర్ తో పాటు ఇతర మంత్రులు ఇబ్బంది పడ్డారు.  ప్రధాన ప్రతిపక్షం లేకపోవటంతో పాటు బుధవారం సభలో చంద్రబాబునాయుడు కూడా లేకపోవటంతో పలువురు సమావేశాలను చాలా తేలిగ్గా తీసుకున్నారు.

ఉదయం ప్రశ్నోత్తరాలు మొదలవ్వాగానే స్పీకర్ ప్రశ్నలను చదువారు. కానీ సదరు మంత్రులు సమాధానాలు చెప్పలేదు. ఎందుకంటే, అసలు మంత్రులు సభలోనే లేరు. సభలో తమ శాఖలపై ప్రశ్నలు వస్తాయని మంత్రులకు తెలిసినా హాజరుకాలేదంటే అర్ధం ఏంటి? మంత్రులు కామినేని శ్రీనివాస్, కాలువ శ్రీనివాసులు, పైడికొండల మాణిక్యాలరావుల ప్రశ్నలను స్పీకర్ చదివినపుడు వారు లేకపోవటంతో స్పీకర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. తర్వాత మంత్రి అచ్చెన్నాయడు వైపు చూసారు. స్పీకర్ భావాన్ని గ్రహించిన అచ్చెన్న మంత్రుల కోసం బయటకు పరుగెత్తారు.

ఇంతలో ప్రధాన ద్వారం వద్ద లోకేష్ ఎదురుపడటంతో జరిగింది చెప్పారు. వెంటనే లోకేష్ టిడిఎల్పీ కార్యాలయ సిబ్బందిపై మండిపడ్డారు. మంత్రులు ఎక్కడున్నా వెంటనే సమాచారం ఇచ్చి సభలోకి వచ్చేలా చూడమన్నారు. దాంతో కొద్ది సేపటికి కామినేని, కాలువ సభలోకి పరుగెత్తుకు వచ్చారు. ఈ విషయాన్ని పక్కనబెడితే చాలా మంది ఎంఎల్ఏలు అసలు సభలోకే రాలేదు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు మంత్రులు, ఎంఎల్ఏలపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos