ఆ మంత్రికి ఎక్కడ పెత్తనమిచ్చినా తలనొప్పులే. ఎప్పుడూ ఎదుటివారిపై ఆధిపత్యపు పోరులోనే బిజీగా ఉంటారు. ఆయనేనండి మార్కెంటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి. ఈయన కుడా ఫిరాయింపు ఎంఎల్ఏనే లేండి. ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటానికి తెరలేపటమే ఇక్కడ గమనార్హం. తాజాగా నంద్యాలలోనూ ఆదినారాయణరెడ్డి ఆధిపత్య పోరు మొదులుపెట్టారు.

ఆ మంత్రికి ఎక్కడ పెత్తనమిచ్చినా తలనొప్పులే. ఎప్పుడూ ఎదుటివారిపై ఆధిపత్యపు పోరులోనే బిజీగా ఉంటారు. ఆయనేనండి మార్కెంటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి. ఈయన కుడా ఫిరాయింపు ఎంఎల్ఏనే లేండి. ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటానికి తెరలేపటమే ఇక్కడ గమనార్హం. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ తరపున గెలిచారు. అయితే, మాజీ మంత్రి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబంతో దశాబ్దాల శతృత్వముంది. అయినాకానీ ఏడాదిన్నర క్రితం టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండి ‘ఒకే ఒరలో రెండు కత్తుల’ సామెతైపోయింది వీరిద్దరి వ్యవహారం.

ప్రతీ విషయంలోనూ రామసుబ్బారెడ్డితో వివాదాలే. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావటంతో ప్రతీ రోజు రెండు వర్గాల మధ్య పరిస్ధితి ఉప్పు-నిప్పులాగ తయారైంది. ఆది రాకను రామసుబ్బారెడ్డి ఎంత వ్యతిరేకించినా ఆపలేకపోయారు. తనను టిడిపిలోకి రాకుండా అడ్డుకున్నారని ఆది, తాను వ్యతిరేకించినా పార్టీలోకి వచ్చారని రామసుబ్బారెడ్డి ఒకరిపై మరొకరు మండిపోతుంటారు. పైగా ఆదికి చంద్రబాబునాయుడు మంత్రిపదవి కట్టబెట్టటం కుడా రామసుబ్బారెడ్డికి ‘పుండుమీద కారం చల్లినట్లైం’ది. దాంతో ప్రతీ విషయంలోనూ ఇద్దరికీ చుక్కెదురే. వీరిద్దరి పోరాటంలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఎన్నికలొచ్చేనాటికి వీరిద్దరి పోరు ఏ స్ధాయికి చేరుకుంటుందో ఎవరూ ఊహించలేకున్నారు.

ఇక, తాజాగా నంద్యాలలోనూ ఆదినారాయణరెడ్డి ఆధిపత్య పోరు మొదులుపెట్టారు. నిజానికి కర్నూలు జిల్లాతో ఆదికి ఏమాత్రం సంబంధం లేదు. మరెందుకని నంద్యాల వ్యవహారాల్లో వేలుపెడుతున్నారు? ఎందుకనంటే, మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో టిడిపి గెలిచింది కదా? ఆ గెలుపులో తన పాత్ర కుడా ఉందంటున్నారు మంత్రి. ఎలాగంటే, నియోజకవర్గంలోని గోస్పాడు మండలానికి ఆదినారాయణరెడ్డే ఇన్చార్జ్. టిడిపికి మెజారిటీ కోసం పలువురు ముఖ్యనేతలకు మంత్రి ఎన్నో హామీలిచ్చారు. అందులో నంద్యాల మార్కెంటింగ్ యార్డు కమిటీ ఛైర్మన్ పోస్టు ఒకటి.

అందులోనూ తన శాఖకు చెందిన పోస్టే కదా అని హామీ ఇచ్చేసుంటారు. కానీ అదే సమయంలో నంద్యాలలోని మరో ఇద్దరికి అదే పోస్టుకు సహచర మంత్రి, స్ధానికురాలైన అఖిలప్రియ కుడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇద్దరిలో ఒకరికి ఛైర్మన్ పోస్టు ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు సిఫారసు కుడా చేసేసారు. ఆ విషయం తెలియగానే ఆది సహచరమంత్రి అఖిలపై మండిపడుతున్నారు. తాను చెప్పిన వారికే పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు ఆది. తన నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి పెత్తనమేంటని అఖిల మండిపడుతున్నారు. చూడబోతే ఆదినారాయణరెడ్డి వల్ల చంద్రబాబుకు తలనొప్పులు తప్పేట్లు లేదు. చూడాలి చివరకు ఏం జరుగుతుందో?