బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబును వెంటాడుతున్న సిబిఐ భయం ?

Naidu fears centre may book cases based Pattiseema CAG reports
Highlights

  • పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటం బిజెపికి ఇష్టం లేనట్లుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కాగ్ నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం సిబిఐ విచారణ జరుపబోతోందా? తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అదే అర్ధం కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటం బిజెపికి ఇష్టం లేనట్లుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్లు బిజెపి ఆరోపించటం అర్ధరహితమన్నారు.

పై ప్రాజెక్టుల్లో ఇంతకాలం కనిపించని ఆవినీతి బిజెపికి ఇపుడే ఎందుకు కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు.  పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశాలకు కాగ్ నివేదికే ఆధారమైతే మోడి ప్రభుత్వం మీద కూడా కాగ్ అనేక నివేదికలు ఇస్తోంది కదా వాటిపైన కూడా సిబిఐ విచారణ జరిపిస్తారా? అంటూ మోడిని నిలదీశారు.

అవినీతిపరులు ఇంతకాలంగా ఏం మాట్లాడుతున్నారో బిజెపి ప్రస్తుతం అదే భాష మాట్లాడుతోందంటూ ధ్వజమెత్తారు. తమపై ఏమని కేసులు పెడతారు? ఎన్ని కేసులు పెడతారు? అంటూ కేసులకు భయపడేది లేదంటూ మండిపడ్డారు. ఒక అవినీతిపరుడు ప్రధానమంత్రిని కలవటమా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందంటూ మండిపడ్డారు. తానెవరికీ లబ్ది చేకూర్చలేదు కాబట్టి ఎవరికీ భయపడేది లేదంటూ కేంద్రానికి సవాలు విసిరారు.

loader