చంద్రబాబునాయుడు ఒక్కోసారి భలే జోకులేస్తారు. ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీల తేడా లేకుండా అర్హులందరికీ అందించాలి’ అని పెద్ద జోక్ పేల్చారు.  పైగా ‘ఎవరి పట్లా వివక్ష పాటించవద్దు’ అంటూ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం విచిత్రంగా ఉంది. గడచిన మూడున్నరేళ్ళుగా సంక్షేమ పథకాల లబ్దిదారలు ఎంపిక ఎంత సవ్యంగా జరిగిందో అందరికీ తెలుసు. లబ్దిదారుల ఎంపిక మొత్తం గ్రామస్దాయిలోని జన్మభూమి కమిటీలకు చంద్రబాబు కట్టబెట్టింది వాస్తవం. సదరు కమిటీసభ్యుల అతి వల్లే గ్రామాల్లో బాగా గొడవలయ్యాయి.

ఇక, లబ్దిదారులుగా ఎంపికవ్వాలంటే కావాల్సిన అర్హతలేంటి? టిడిపి నేతల లెక్క ప్రకారం లబ్దిదారులు పార్టీసభ్యులై ఉండాలి. సభ్యత్వం చూపితేనే పెన్షన్లైనా, రేషన్ కార్డులైనా, ఇళ్ళ పట్టాలైనా అందుతాయి. ఇక గ్రామీణ స్ధాయిలో రేషన్ షాపుల డీలర్లుగా నియమితులవ్వాలన్నా టిడిపి సభ్యత్వముండటమే ఏకైక అర్హత. డ్వాక్రా మహిళలకు బ్యాంకు లోన్లు అందాలన్నా టిడిపి నేతలు సిఫారసు చేయనిదే లోన్ రాదు.

జన్మభూమి కమిటీల ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి కాబట్టే పలు చోట్ల స్ధానికులు కమిటీసభ్యులపై తిరగబడ్డారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీల్లో సభ్యత్వం కోసం, లబ్దిదారుల ఎంపికలో ఫిరాయింపు ఎంఎల్ఏల అనుచరులకు, పార్టీ నేతల అనుచరులకు మధ్య జరిగిన గొడవలతో అసలు వ్యవహారాలు చాలా చోట్ల రచ్చకెక్కిన మాట నిజం కాదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలీకుండానే జరిగాయా? వాస్తవాలిలా ఉండగా చంద్రబాబేమో సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపచేయాలని ప్రజాప్రతినిధులకు కాకుండా చెప్పేదేదో అధికారులకే చెప్పవచ్చు కదా?

మొన్నటి నంద్యాలఎన్నిక ముందు జరిగిందేంటి? సంక్షేమ పథకాల లబ్దిదారులుగా కేవలం టిడిపి వాళ్ళని, నేతలు సిఫారసు చేసిన వారిని మాత్రమే ఎంపిక చేసారు. మహిళలకు పంపిణీ చేసిన కుట్టుమిషన్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు.. ఇలా సమస్తం టిడిపి వాళ్ళకే దక్కాయి. చివరకు ‘రైతురథం’ పేరుతో పంపిణీ చేసిన ట్రాక్టర్లు కుడా నేతల సిఫారసు మేరకే జరిగాయి. దాంతో ఎప్పటి నుండో ట్రాక్టర్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు తిరగబడింది నిజం కాదా?

వచ్చే ఏడాది ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకనే అర్హులందరికీ సంక్షేమపథకాలు అందాలన్న కొత్త నాటకానికి తెరలేపారు. పైగా కేవలం అర్హతల మేరకే నంద్యాలలో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. నంద్యాల ఎన్నిక షెడ్యూల్ రాకముందు ‘టిడిపికి ఓట్లు వేయటానికి ఇష్టపడకపోతే తమ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, రేషన్ కార్డులు తీసుకోవద్దు, తామేసిన రోడ్లపై తిరగొద్దని చెప్పిందెవరో? ఓట్లేయాలని జనాలను బెదిరించిందెవరు?