పార్టీని వదిలి వెళ్ళే ఆలోచనలో ఉన్న నేతలను గుర్తించాలని ఆదేశించారు. అటువంటి వారితో మంత్రులు మాట్లాడి బుజ్జగించాలని చెప్పారు. అధికార పార్టీలో నుండి ప్రతిపక్షంలో వెళితే ఎదురవ్వబోయే సమస్యలను వివరించి చెప్పాలని కూడా ఆదేశించారు. అంటే చంద్రబాబులో అభద్రత స్పష్టంగా కనబడుతోంది.
నంద్యాల నియోజకవర్గంపై చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. టిడిపి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఈనెల 21వ తేదీన నంద్యాలలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. శిల్పా పార్టీని వీడిన ప్రభావంపై అంచనా వేసేందుకు మంగళవారం ఉదయమే చంద్రబాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి అఖిల ప్రియ, పలువురు నంద్యాల నియోజకవర్గ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు.
నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితిపై ఆరా తీసారు. శిల్పా పార్టీని వీడటంపై ఏమన్నా నష్టం జరుగుతుందా? శిల్పాతో పాటు పార్టీని వీడేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై మాట్లాడారు.
చంద్రబాబుతో అఖిల మాట్లాడుతూ, శిల్పాతో పాటు పార్టీని వీడేవారు ఎవరూ లేరని చెప్పారు. శిల్పా పార్టీ నుండి వెళ్ళిపోయిన ప్రభావం టిడిపిపై ఏమాత్రం ఉండదన్న ధీమా వ్యక్తం చేసారు. అయితే, అఖిల మాటలను చంద్రబాబు పూర్తిగా నమ్మలేదు. పార్టీని వదిలి వెళ్ళే ఆలోచనలో ఉన్న నేతలను గుర్తించాలని ఆదేశించారు. అటువంటి వారితో మంత్రులు మాట్లాడి బుజ్జగించాలని చెప్పారు. అధికార పార్టీలో నుండి ప్రతిపక్షంలో వెళితే ఎదురవ్వబోయే సమస్యలను వివరించి చెప్పాలని కూడా ఆదేశించారు. అంటే చంద్రబాబులో అభద్రత స్పష్టంగా కనబడుతోంది.
పార్టీకి రాజీనామా చేసిన వారితో ఇంకెవరూ వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసారు. శిల్పా రాజీనామాతో టిడిపికి ఎటువంటి నష్టమూ లేదని బాగా ప్రచారం చేయాలని ఆదేశించటంతోనే చంద్రబాబులో ఏ స్ధాయిలో ఆందోళన ఉందో అర్ధమవుతోంది. రాబోయే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో భారీ ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అంతేకాకుండా నంద్యాల నియోజకవర్గంపై తానే ప్రత్యేక దృష్టి పెడతానని కూడా నేతలకు స్పష్టంగా చెప్పటం చూస్తుంటే శిల్పా దెబ్బ బాగా పడినట్లే కనబడుతోంది.
