శనివారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసినపుడు రెడ్డితో మాట్లాడుతూ వైసీపీలో చేరేంతటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో రెడ్డి వైసీపీలో చేరే విషయంపై ప్రచారం ఊపందుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు సీనియర్ నేత రామసుబ్బ రెడ్డి టిడిపిని వీడనున్నారా? జరుగుతన్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ఆమధ్య బాగా ప్రచారం జరిగినా ఎందుకో తర్వాత ఆగిపోయింది. అయితే, మళ్లీ తాజాగా టిడిపిలో ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసినపుడు రెడ్డితో మాట్లాడుతూ వైసీపీలో చేరేంతటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో రెడ్డి వైసీపీలో చేరే విషయంపై ప్రచారం ఊపందుకుంది.
నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి నుండి తనకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు గానీ, తన మద్దతుదారులకు గానీ పనులు జరగకుండా మంత్రి అడ్డుకుంటున్నట్లు రెడ్డి సిఎంతో ఫిర్యాదు చేసారు. తన ప్రత్యర్ధి ఆదినారాయణరెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నట్లు మండిపడ్డారు.
ఆదిని వైసీపీలో నుండి పార్టీలోకి చేర్చుకునేటప్పుడే వద్దని వారించినా వినలేదని చంద్రబాబును కూడా నిష్టూరాలాడినట్లు సమాచారం. పైగా మంత్రి పదవి వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇవ్వటం వల్లే జిల్లాలో, నియోజకవర్గంలో సమస్యలు వస్తున్నాయని మంత్రిపై ధ్వజమెత్తారు. తనను తొక్కేయటానికి మంత్రి ఇతర నేతలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసారు. అంతా విన్న చంద్రబాబు ఎవరి నుండి కూడా సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. తొందరపడి వైసీపీలోకి వెళ్ళే నిర్ణయాలేవీ తీసుకోవద్దని గట్టిగా చెప్పినట్లు చెప్పారు. అయితే, నంద్యాల ఉపఎన్నికల సమయంలోనే రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడటంతోనే రెడ్డి పార్టీ మారే విషయంలో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
