జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసారు. పవన్ ను ఉద్దేశించి మొన్న మంత్రి పితాని సత్యనారాయణ, గతంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు పవన్ అంటే ఎవరు అన్నట్లు అశోక్ మాట్లాడితే, పవన్ తో మాకు పనేంలేదు అని పితాని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ ‘సంతోషం’ అంటూ ట్విట్టర్ వేదికగా సమాధానం స్పందించారు.
మంత్రులు-పవన్ మాటలు ఎక్కడికి దారితీస్తాయో అన్నట్లు తయారైంది పరిస్ధితి. దాంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారట. పవన్ పై ఏ పరిస్ధితుల్లో మంత్రులు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో సిఎం ఆరాతీసారట. అనంతరం మౌనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలపై పార్టీ అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడొద్దని, అలాంటి అంశాలను పార్టీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలంతా మౌనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
