జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను టిటిడిపిలోని ఎవరూ ఖాతరు చేయటం లేదు. దాంతో రెండు వర్గాల మధ్య చంద్రబాబు బాగా ఇరుక్కుపోయారు. టిటిడిపి నేతలు నిట్ట నిలువుగా రెండు వర్గాలుగా చీలిపోయి చంద్రబాబును బాగా ఇరికించేసారు.

ఇంతలో ఎంత విచిత్రం. జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను టిటిడిపిలోని ఎవరూ ఖాతరు చేయటం లేదు. దాంతో రెండు వర్గాల మధ్య చంద్రబాబు బాగా ఇరుక్కుపోయారు. టిటిడిపి నేతలు నిట్ట నిలువుగా రెండు వర్గాలుగా చీలిపోయి చంద్రబాబును బాగా ఇరికించేసారు.

‘వదలమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం’ అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్ధితి. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకోవాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టిగా వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, తాజాగా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తదితరులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తోనే పొత్తులు పెట్టుకోవాలంటూ వాదన మొదలుపెట్టారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తోను కేంద్రంలో భారతీయ జనతా పార్టీతోనూ పొత్తులట.

వచ్చే ఎన్నికల వరకూ పొత్తుల కథను గుట్టుగా నడిపించాలనుకుంటున్న చంద్రబాబు వ్యూహాన్ని ఒకవిధంగా మోత్కుపల్లి బహిరంగ ప్రకటనలు ఇబ్బంది పెడ్తున్నాయని తెలిసింది. మోత్కుపల్లి దోరణి చూస్తే ఆయన టిడిపియా లేక టిఆర్ ఎస్ అధికారప్రతినిధా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

మొత్తం మీద టిటిడిపి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి చంద్రబాబుకు తలనొప్పులు తెస్తున్నారు. తలనొప్పులు ఎంతదాకా వెళ్ళిందంటే చివరకు విదేశాల్లో కూడా చంద్రబాబుకు మనశ్శాంతిని దూరం చేసేంతగా.

చంద్రబాబు విదేశాల నుండి వచ్చేనాటికి టిటిడిపిలోని రెండు వర్గాల్లో ఒకటి కాంగ్రెస్ తోను మరో వర్గం, టిఆర్ఎస్ తో పొత్తులు పెట్టేసుకునేట్లే కనబడుతున్నాయి. విచిత్రమేమిటంటే పొత్తుల గురించి ఎవరూ బహిరంగ మాట్లాడవద్దని చెబుతున్నా ఏ వర్గం కూడా చంద్రబాబు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.