మొత్తానికి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. శాసనమండలి ఛైర్మెన్‌గా ఎన్ఎండి ఫరూక్‌ను నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు.

మొత్తానికి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. శాసనమండలి ఛైర్మెన్‌గా ఎన్ఎండి ఫరూక్‌ను నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా టిడిపి గెలిస్తే ముస్లింలకే మండలి ఛైర్మన్ పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటిచిన సంగతి అందరికీ తెలిసిందే కదా? అప్పటికే ఫరూఖ్ కు ఈ మేరకు చంద్రబాబు వాగ్దానం చేసారు లేండి. ఫరూఖ్ కు కుడా కేవలం ఉపఎన్నిక కారణంగానే ఎంఎల్సీ దక్కింది.

సో, అప్పటి హామీని చంద్రబాబు ఈ రోజు నెరవేర్చుకున్నారు. గతంలో శాసనమండలి ఛైర్మెన్ పదవిని శిల్పా చక్రపాణిరెడ్డికి ఇస్తానని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. ఎప్పుడంటే చక్రపాణి టిడిపిలో ఉన్నపుడు సంగతి లేండి. కానీ తర్వాత పరిణామాల్లో చక్రపాణి వైసీపీలోకి వెళ్లిపోవటంతో అదే హామీని చంద్రబాబు ఫరూఖ్ కు ఇచ్చారు.

నంద్యాల ఉపఎన్నికలో ముస్లింఓట్లు గెలుపుఓటములపై ప్రభావం చూపాయి. ఓ అంచనా ప్రకారం నియోజకవర్గంలోని ముస్లిం ఓట్లలో అత్యధికులు టిడిపికే ఓట్లు వేసారట. సరే, అన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే చంద్రబాబు ప్రకటించారనుకోండి అదివేరే సంగతి. అమరావతిలో సోమవారం జరిగిన టిడిపి వర్క్‌షాప్‌లో చంద్రబాబునాయుడు ఫరూక్‌కు శాసనమండలి ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.