అన్నీ వ్యవస్ధలను బిజెపి భ్రష్టుపట్టించింది

First Published 25, Mar 2018, 1:18 PM IST
Naidu alleged bjp spoiled the entire system
Highlights
  • బిజెపిపై చంద్రబాబునాయుడు ఫైరైపోయారు

బిజెపిపై చంద్రబాబునాయుడు ఫైరైపోయారు. ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ, తమ ప్రభుత్వంపై కేసులు వేయాలని డిమాండ్ చేయటమేంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై కేసులు వేయాలనుకునే ముందు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడిపై ఉన్న అవినీతి ఆరోపణల వ్యవహరం

 తేల్చాలని డిమాండ్ చేశారు. తన కొడుకు అవినీతిపై వినిపిస్తున్న ఆరోపణలపై షా ముందు జవాబు చెప్పాలన్నారు.

అన్నీ వ్యవస్ధలనూ కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించందని ధ్వజమెత్తారు. అందరికీ నీతులు చెప్పే బిజెపి యుపిలో ఒక రాజ్యసభ స్ధానం కోసం ఎందుకు దిగజారిందని నిలదీశారు. గుజరాత్ లో రాజ్యసభ సీటు కోసం ఏం చేశారో తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యసభ సీటు కోసం మనకు ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రమే తక్కువన్నారు. అయినా సరే విలువల కోసం మూడో రాజ్యసభ సీటుకు పోటీ పెట్టలేదన్న విషయం అందరూ గ్రహించాలన్నారు.

 

loader