Asianet News TeluguAsianet News Telugu

హటాత్తుగా నిరుద్యోగభృతి ఎందుకు గుర్తుకొచ్చింది?

  • గురువారం హటాత్తుగా నిరుద్యోగులకు ఆర్ధికసాయంపై సిఎం సమీక్ష నిర్వహించారు.
  • ఎందుకు ఇంత హటాత్తుగా సమీక్ష నిర్వహించారన్నదే ప్రశ్న.
  • అందుకు రెండు కారణాలు కనబడుతున్నాయ్. మొదటిది నంద్యాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలవ్వటం.
  • రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని తేలిపోవటం.
Naidu again raises bogey of allowance to unemployed in AP

నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత, అసెంబ్లీ నియోకవర్గాలు పెరగవని తేలిపోయిన తర్వాత చంద్రబాబునాయుడుకు హటాత్తుగా నిరుద్యోగులు గుర్తుకువచ్చారు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఇవ్వలేకపోతే ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ. 2 వేల భృతి ఇస్తాన’ని పోయిన ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కిన అనేక హామీల్లో ఇదికూడా ఉంది. ఉద్యోగాలనైనా భర్తీ చేయాలని లేదా నిరుద్యోగభృతి అయినా ఇవ్వాలంటూ నిరుద్యోగులు మూడేళ్ళల్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

అయితే, గురువారం హటాత్తుగా నిరుద్యోగులకు ఆర్ధికసాయంపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఎందుకు ఇంత హటాత్తుగా సమీక్ష నిర్వహించారన్నదే ప్రశ్న. అందుకు రెండు కారణాలు కనబడుతున్నాయ్. మొదటిది నంద్యాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలవ్వటం. రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని తేలిపోవటం. నంద్యాలలో గెలుపుకు టిడిపి నానా అవస్తలు పడుతున్నది. స్వయంగా చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో కూడా టిడిపికి ఇబ్బందే అన్న విషయం స్పష్టమైందట.

అందుకనే వివిధ సామాజికవర్గాలను బుట్టలో వేసుకునేందుకు  వారికి అనేక తాయిలాలు పంపిణీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అందులో భాగంగానే నిరుద్యోగులకు భృతిపై వివరాల సేకరణ అన్నది అయ్యుండచ్చని అనుమానం. ఒక్క నంద్యాలలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇవ్వటం సాధ్యం కాదా? అందుకనే రాష్ట్రమంతటా లెక్కలు సేకరించాలని హడావుడి మొదలుపెట్టారు.

సరే, నిర్ణయం అమల్లోకి వస్తుందా రాదా అన్నది వేరే సంగతి. ఎందుకంటే, వివరాలు వచ్చేటప్పటికి ఉపఎన్నికలైపోతాయి. అయితే, ప్రచారంలో మాత్రం నిరుద్యోగ భృతికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది.

అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగవని ప్రధానమంత్రి స్పష్టం చేసినట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం చెప్పిన సంగతి అందరూ చూసిందే. అప్పటి నుండి చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ప్రధాని నిర్ణయం వల్ల చద్రబాబుకు రెండు రకాల ఇబ్బందులు తప్పవు.

మొదటిది రాజకీయ సమస్య. రెండోది వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల వ్యతిరకేతను ఎదుర్కోవటం. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న నినాదాన్ని పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టించేసారు. చంద్రబాబు హామీని నమ్మిన నిరుద్యోగల్లో అనేకులు చంద్రబాబుకు ఓట్లేసారు. సరే, తర్వాత దెబ్బతిన్నారు లేండి. ఆ దెబ్బే వచ్చే ఎన్నికల్లో తనకు తగులుతుందేమో అన్న ఆందోళన చంద్రబాబులో మొదలైంది. అందుకే నిరుద్యోగ భృతిపై లెక్కలు తీయండంటూ హడావుడి మొదలుపెట్టినట్లున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios