Asianet News TeluguAsianet News Telugu

బిజెపితో పొత్తు చెడగొట్టకండి, ప్లీజ్

దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది. ఎన్డీయే తో టిడిపి పొత్తు ఇలాంటిదే. అందువల్ల పార్టీ  పొత్తులపై టిడిపి నేతలు వ్యాఖ్యానాలు చేయడం మంచిదికాదు- చంద్రబాబు

naidu advises tdp men not to speak against BJP at any cost

భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ్ముళ్లకు హెచ్చరిక చేశారు.

‘పొత్తులమీద జాగ్రత్తగా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీకి జాతీయ విధానం ఉంది. నాలుగు సార్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలను నిలబెట్టిన ఘనత టిడిపిది. పొత్తులపై ఎవ్వరూ విమర్శలు చేయడానికి వీల్లేదు. ఎవరో ఏదో అన్నారని రెచ్చిపోయి  మీరు ఏదో ఒక విమర్శ చేసి ఇరకాటంలో పడొద్దు. పార్టీని ఇరకాటంలో పెట్టవద్దు.  పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం. ఏదైనా నిర్ణయం చేయాలనుకుంటే పార్టీ హై కమాండే చేస్తుంది...' అని చంద్రబాబు  గట్టిగా చెప్పారు.

 

టిడిపితో పొత్తు వద్దు అనే దోరణి బిజెపిలోప్రబలుతుఉన్న సంగతి తెలిసిందే.

 

ఈ మధ్య బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో  మాట్లాడుతున్నపుడు కార్యకర్తలు ప్లకార్డులతో ‘మాకు బిజెపి ముఖ్యమంత్రి కావాల’ని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ‘బిజెపితో పొత్తు లేకపోయినా గెలుస్తాం, పొత్తు వల్ల టిడిపి నష్టపోయింద’ని విజయవాడ ఎంపి కేశినేని నాని వంటి వారు మాట్లాడి చంద్రబాబును ఇరుకున పెట్టిన సంగతి కూడా తెలిసిందే.

 

బిజెపితో పొత్తును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబుకిది ఇబ్బందిగా తయారయింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆయన  పార్టీ నేతలందరికి ఈ విజ్ఞప్తి చేశారు. ‘జాతీయ రాజకీయాలు- తెలుగుదేశంపార్టీ’అనే అంశం మీద టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం ప్రవేశపెట్టిన తీర్మానం మీద ప్రసంగిస్తూ పార్టీ అధ్యక్షుడు ఈ హెచ్చరిక చేశారు.

 

‘దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది.ఇలాంటి పొత్తులపై పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేయడం మంచిదికాదు,’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios