శ్రీకాకుళం: జిల్లాలోని సీతంపేటకు చెందిన బీటెక్ స్టూడెంట్ నగేష్ అనుమానాస్పదస్థితి మృతితో కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. శివానీ కాలేజీ వద్ద గ్రామస్తులు సహచర విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

సీతంపేట గ్రామ శివారులో స్టూడెంట్ నగేష్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగేష్ మృతిపై పేరేంట్స్ అనుమానం వ్యక్తం చేశారు.ఈ నెల 25వ తేదీన యూనిఫాం కోసం ఇంటికి వచ్చాడు. ఈ నెల 26వ తేదీ నుండి ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయి ఉంది. నగేష్ ను ఎవరో హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

నగేష్ హత్యను నిరసిస్తూ  గ్రామస్థులు  కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. నగేష్ గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.  గ్రామస్తులు కాలేజీ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

ఆందోళన కారులకు పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనలకారులను పోలీసులు చెదరగొట్టారు. కాాలేజీకి సుమారు 20 కిమీ దూరంలో నగేష్ అనుమానాస్పదస్థితిలో శవమై తేలడంపై  గ్రామస్థులు, పేరేంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమే ఇందులో స్పష్టంగా కన్పిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.