గుంటూరు; గుంటూరు ఆసుపత్రి నుండి దివ్యతేజ హత్య కేసులో నిందితుడు నాగేంద్ర బాబు శుక్రవారం నాడు డిశ్చార్జ్ అయ్యాడు.

ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన విజయవాడలో దివ్యతేజను నాగేంద్రబాబు దారుణంగా కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన దివ్యతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ డిశ్చార్జ్ అయ్యాడు.

also read:దివ్యతేజ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం: నిందితుడిని శిక్షిస్తామని సీఎం జగన్ హామీ

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దివ్యతేజ హత్య కేసులో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం జగన్ దివ్యతేజ తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.నాగేంద్రబాబు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీసులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

దివ్యను తాను పెళ్లి చేసుకొన్నానని నాగేంద్రబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అదంతా అబద్దమని దివ్యతేజ తల్లిదండ్రులు కొట్టిపారేశారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగేంద్రబాబును అదుపులోకి తీసుకొంటే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు.