ఎమ్మెల్యే రోజాను పొగిడిన నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని సస్సెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం.
కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని సస్సెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం.
నిబంధనలకు విరుద్దంగా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సెల్పీ వీడియోను గురువారం నాడు విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరోనా నుండి కాపాడుకొనేందుకు కనీసం గ్లౌజులు, ప్రొటెక్షన్ కిట్స్ లేవని కూడ ఆయన ఆ వీడియోలో ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రోజా మాత్రమే ఆదుకొందని ఆయన చెప్పారు. మున్సిపల్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని కూడ ఆరోపించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కనీసం తమకు ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. నగరిలో ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తాము ఎంతో కష్టాలు పడుతున్నా కూడ ప్రభుత్వం నుండి స్పందన లేదని కూడ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రోజా ఆదుకోకపోతే తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్లమని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని నగరి దాటి వెళ్లకూడదని కూడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
also read:ఎమ్మెల్యే రోజాను పొగుడుతూ..మున్సిపల్ ఉద్యోగి వీడియో, వైరల్
నగరి మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును నగరి మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్టుగా శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్కులు,పీపీఈ కిట్స్ విషయమై విశాఖపట్టణం జిల్లా నర్నీపట్టణం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సుధాకర్ కూడ ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకొంది ప్రభుత్వం. సుధాకర్ ను సస్పెండ్ చేసింది. గ్లౌజులు, పీపీఈ కిట్స్ లేకుండా వైద్యులు ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది.