MLA Roja: తనపై అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవ‌ల్సి ఉంటుంద‌ని టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్‌పై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.  

MLA Roja: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అసత్య ఆరోపణలపై తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ్డారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని గాలి భానుప్రకాష్‌పై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లడుతూ..భానుప్రకాష్‌ చేసిన ఆరోపణలను ఖండించారు. ప్ర‌జల ఆగ్ర‌హానికి గురై ఎన్నిక‌ల్లో ఓడిపోయి.. రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని వాళ్ళు.. ఇప్పుడూ ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే.. చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు.

ఎమ్మెల్యే రోజా.. నగరిలో తన వ్యతిరేక వర్గానికి వైసీపీలో కీలక పదవులు రావడంతో..త‌న పార్టీ వైసీపీ మీద అసంతృప్తిగా ఉంద‌నీ, తాను పార్టీకి రాజీనామా చేస్తారంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు.

తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కొందరు నేత‌లు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అస‌లు తానెందుకు పార్టీని వీడి వెళ్లిపోతాన‌ని, రాజీనామా చేయాల్సిన అవ‌స‌రమేమున్నంద‌నీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందు నుంచే ఆయన వెంట ఉన్నట్లు ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. తన‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేవాళ్లే.. పార్టీ వీడి బయటకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సీఎం జ‌గ‌న్ త‌న సొంత చెల్లిగా భావించి.. త‌న‌ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేశార‌నీ, ఆయ‌న‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు తాను జగనన్న‌ అడుగుజాడల్లోనే నడుస్తానని వెల్ల‌డించారు. 

తాను నంబర్‌వన్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు క‌ట్టుకున్నాననీ, అలాగే.. వైఎస్సార్‌సీపీలోకి రాకముందు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్‌లో ఉన్నప్పుడే కట్టానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్ర‌తి ఇంటిని త‌న సొంత డబ్బుతో కట్టిందేనని వెల్లడించారు. అక్రమంగా సంపాదించాల్సిన సోమ్ముతో క‌ట్టుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు.అలాగే.. త‌న పేరు మీదుగా రోజా చారిటబుల్‌ ట్రస్టు పెట్టి.. పేద‌ల‌కు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. 

 గాలి భానుప్రకాష్ కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలని అన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడని రోజా విమ‌ర్శించారు.