కొత్త జిల్లాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం ప్రధానంగా బాలాజీ జిల్లాలోనే ఉన్నదని, కొంత భాగం చిత్తూరులో ఉన్నదని వివరించారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలుపాలని ప్రజలు కోరుతున్నారని, తాను ఈ మేరకు సీఎం జగన్‌కు వినతి అందిస్తానని చెప్పారు.
తిరుపతి: నగరి నియోజకవర్గ(Nagari Constituency) ఎమ్మెల్యే రోజా(MLA Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో చర్చనీయాంశమైన కొత్త జిల్లాలపై ఆమె మాట్లాడారు. తన నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతి అందిస్తామని తెలిపారు. నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ఛండీ హోమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద ఎమ్మెల్యే రోజాను తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన జిల్లా బాలాజీలో నగరి నియోజకవర్గం ప్రధానంగా ఉన్నదని, మరికొంత చిత్తూరు జిల్లాలో ఉన్నదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. తమ నియోజకవర్గం నగరి రెండు జిల్లాల్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజల తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అంటే.. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని సీఎం జగన్‌కు వినతి అందజేస్తామని తెలిపారు.
కొందరు కొత్త జిల్లాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కొత్త జిల్లాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకురావడానికి మార్చి 2వ తేదీ వరకు జగన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని వివరించారు. కానీ, కొంత మంది కావాలనే కొత్త జిల్లాలపై అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ew District ఏర్పాటు విషయమై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు , బాలాజీ జిల్లాల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బుధవారం నాడు మాజీ మంత్రి Anam Ramana Narayana Reddy నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజనలో వెంకటగిరికి అన్యాయం జరిగిందన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా ప్రజలు సిద్దంగా లేరన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా Nellore-Balaji జిల్లాల పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. YCPకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ఈ విషయమై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలకు పేర్లు పెట్టే విషయంతో పాటు జిల్లాల కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై కూడా ఆందోళనలు సాగుతున్నాయి. అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత అసెంబ్లీ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీపై విమర్శలు గుప్పించారు. కానీ ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇవాళ మాత్రం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం ఏం చేస్తోందోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
