హైదరాబాద్: సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. కానీ, తాజాగా సినీ పరిశ్రమలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నందమూరి హీరో బాలకృష్ణపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు నాగబాబుపై విరుచుకుపడుతున్నారు.

Also Read: `సారి కావాలా రా`.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న బాలయ్య ఫ్యాన్స్‌ 

పబ్లిక్ హెల్త్ వార్నింగ్ అంటూ పిచ్చికుక్కలతో వ్యవహారం నడపం ప్రమాదకరమని, వాటిని కంటైన్మెంట్ లో పెట్టినా లేదా రూపుమాపడానికి ప్రయత్నించినా వాటిని దాన్ని విస్మరించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మన ప్రాణాలకు ముప్పు అని, ఇది పిచ్చికుక్కల సీజన్ అని ఆయన ఆంగ్లంలో ట్వీట్ చేసి మొరుగుతున్న కుక్క బొమ్మను జత చేశారు. 

 

దానికి తోడు, తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి  వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో jsp పార్టీ వస్తుందో,బీజేపీ పార్టీ  వస్తుందో కాలమే నిర్ణయించాలి.కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం.ఎందుకంటే టీడీపీ హయాం  లో Ap ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు.development అంతా టీవీల్లో పేపర్స్ లో తప్ప" అని నాగబాబు అన్నారు.

Also Read: చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడాం, దాసరి చాలా పెట్టారు: తమ్మారెడ్డి

దానికి కొనసాగింపుగా.... "నిజంగా చేసింది చాలా తక్కువ.అందుకే ఎలక్షన్స్ లో చాలా ఘోరంగా ఓడిపోయిందన్న విషయం టీడీపీ వారు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే they ఆర్ welcome. కాకపోతే మానసిక శాస్త్రం లో అలాంటి పరిస్థితి ని Hellusinations అంటారు.all the best ఫర్ your hellusinations" అని నాగబాబు ట్వీట్ చేశారు..