రాజధాని విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు...సహకారం అంటూనే జగన్ కి చురకలు

ఇటీవల నాదెండ్ల మనోహర్ తో కలిసి అమరావతి పరిసర ప్రాంత పర్యటనకు నాగబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇదే విషయాన్నీ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్  రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి తాను కూడా పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  

nagababu requests jagan not to create confusion over the capital issue

ఆంధ్రప్రదేశ్లో లో మూడు రాజధానులపై  జగన్ చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తుంటే ఇంకొందరేమో తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ మూడు రాజధానుల ప్రకటనపై సినీనటుడు, జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు  అయిన నాగబాబు స్పందించారు. 

ఇటీవల నాదెండ్ల మనోహర్ తో కలిసి అమరావతి పరిసర ప్రాంత పర్యటనకు నాగబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇదే విషయాన్నీ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్  రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి తాను కూడా పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  

అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని అక్కడున్న రైతులంతా, ప్రజలంతా రోడ్లపైకొచ్చి నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో వారి ఆందోళనల్ని అర్థం చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి నాగబాబు విజ్ఞప్తి చేశారు. 

Also read: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ భారీ 'షాక్': కరెంటు ఎక్కువ వాడారో రేషన్, పెన్షన్ కట్

"దయచేసి వారి ఇబ్బంది అర్థం చేసుకోండి" అని నాగబాబు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని అంటే యస్ అన్నారని గుర్తుచేశారు. అధికారం ఇప్పుడు జగన్ చేతిలో ఉందిని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. రాజధాని రైతుల్నిదృష్టిలో పెట్టుకోవాలని నాగబాబు అన్నారు. 

రైతులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన చెందారు. వైసీపీ చెబుతున్నట్లు అమరావతిలో గనుక ఒకవేళ స్కాం జరిగి ఉంటే... దానిపై చర్యలు తీసుకోవాలని తాను కూడా కోరుతున్నానన్నారు నాగాబాబు. 

అయితే కేవలం కొద్దిమంది చేసిన తప్పుకు కొన్నివేలమందిని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఎకాడ చేసినా అది రాష్ట్రప్రభుత్వ ఇష్టమని, కానీ రాజధాని విషయంలో కనఫ్యూ‌జన్ కు ప్రజలను గురి చేయొద్దన్నారు నాగబాబు. 

Also read: AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

ప్రజల్ని కష్టాలు పెట్టి ఏడిపించిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదని ఆయన గతాన్ని గుర్తు చేసారు. వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులు గురి చేయోద్దని ఆయన వ్యాఖ్యానించారు. 

రైతులకు స్పష్టత ఇచ్చి వారికి అండగా నిలవాలన్నారు. భూముల్ని వెనక్కి ఇచ్చేయడం సమస్యకు పరిష్కారం కాదని ఆయన భూములు వెనక్కిచ్చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రైతులకు మాత్రం అన్యాయం చేయోద్దని జగన్‌కు విజ్ఞప్తి చేస్తూనే.... ఏపీ అభివృద్ధి విషయంలో తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios