హైదరాబాద్: అన్నయ్యకు, పవన్ బాబుకు మధ్య చాలా తేడా ఉందని  మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. అన్నయ్య సున్నితమైన మనస్సు కలవాడు. పవన్ కూడ అలానే ఉంటాడు, కానీ తాను  అనుకొన్న లక్ష్యాన్ని సాధించేవరకు పట్టుదల విడవకుడా మొండిగా పోరాటం చేస్తాడని చెప్పారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నాగబాబు పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.  ప్రజారాజ్యం  పెట్టినా....చివర్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని చెప్పారు. 

కానీ, పవన్ కళ్యాణ్  ఏ లక్ష్యం కోసం పార్టీ పెట్టారో ఆ లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతారని చెప్పారు.  పవన్ కళ్యాణ్ మొండివాడన్నారు. అన్నయ్యకు పవన్ ‌కు మధ్య తేడా ఇదేనని నాగబాబు వివరించారు.

పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టే సమయంలో  ఎందుకు కళ్యాణ్ బాబు రిస్క్ తీసుకొంటున్నాడని తాను భావించినట్టు చెప్పారు. ఏడాది తర్వాత  మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం సరైందేనని తాను భావించినట్టు చెప్పారు.

తమ మద్దతు పవన్ కళ్యాణ్‌కు అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నయ్య తరహాలో సున్నితమైన మనస్సు పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. కానీ అదే సమయంలో తన దారిలో ఎదురయ్యే ఆటంకాలను గట్టిగా ఎదుర్కోనే సత్తా పవన్‌కు ఉందని నాగబాబు అభిప్రాయపడ్డారు.కళ్యాణ్ బాబులో ఉన్న మొండితనం, ధైర్యం అన్నయ్యలో లేదన్నారు.

సంబంధిత వార్తలు

పీఆర్పీని అన్నయ్య అందుకే కొనసాగించలేదు: నాగబాబు

నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్‌కు చిరంజీవి దూరమే