జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు నాగబాబు. బఫూన్ గాళ్లకి సమాధానం ఇచ్చేంత ఓపిక, తీరిక మా బాస్‌కి లేదని ఆయన అన్నారు.  

జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిని స్వీకరించిన పవన్ చేనేత వస్త్రాలు ధరించి మరికొందరికి ఛాలెంజ్ విసిరారు. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి, 175 సీట్లకి పోటీ చేస్తున్నారా లేదా అనేది స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా ప్రకటించాలంటూ కోరారు. 

దీని వెనుక చాలా లోతైన అర్ధం వుంది. పవన్ 175 సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్న సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ.. అంబటి ట్వీట్‌కు స్పందించకుంటే.. జనసేన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలు పంపినట్లే. 

ALso Read:పవన్‌కు అంబటి సవాల్.. సీన్‌లోకి బండ్ల గణేశ్, ‘‘రంభ’’ల రాంబాబు అంటూ సెటైర్లు

దీనిపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఘాటుగా స్పందించారు. తాజాగా పవన్ సోదరుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సైతం రాంబాబుకు కౌంటరిచ్చారు. మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన... ‘‘ ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ... ఓ రాంబాబు... జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసిపి సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

అంతకుముందు నిర్మాత, సినీనటుడు బండ్ల గణేశ్ సైతం తన మార్క్ పంచులతో ఓ ట్వీట్ వదిలారు. ‘‘అలాగే రంభల రాంబాబు గారు మాసారు త్వరలో మీకు సమాధానం చెబుతారు ... జై పవన్ కల్యాణ్ ’’అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…