జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి అంబటి రాంబాబుకు గట్టి కౌంటరిచ్చారు నిర్మాత బండ్ల గణేశ్. రంభల రాంబాబు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మెగాస్టార్ కుటుంబం ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై (Pawan kalyan) ఈగ కూడా వాలనివ్వరు నిర్మాత బండ్ల గణేష్ (bandla ganesh) . పవన్‌ను ఎవరైనా, ఏమైనా అంటే వెంటనే వాళ్లకి ఘాటుగా బదులిస్తుంటారు బండ్ల గణేశ్. ఈ విషయం ఎన్నో వేదికల మీద ప్రూవ్ అయ్యింది కూడా . తాజాగా వైసీపీ (ysrcp) నేత, మంత్రి అంబటి రాంబాబుకు (ambati rambabu) కౌంటరిచ్చారు బండ్ల గణేశ్.

అసలేం జరిగిందంటే:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కుల , మతాలకు అతీతంగా పనిచేస్తానన్న పవన్ కల్యాణ్... గత ఎన్నికల్లో కుల రాజకీయాలు చేసుంటే తనకు 40 సీట్లు వచ్చేవన్నారు. అలాగే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీలనివ్వనని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. పవన్ కల్యాణ్ కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారా లేదా అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఈ విషయాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. దీని వెనుక చాలా లోతైన అర్ధం వుంది. పవన్ 175 సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్న సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ.. అంబటి ట్వీట్‌కు స్పందించకుంటే.. జనసేన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలు పంపినట్లే. 

దీనిపై పవన్ , జనసేన అభిమానులు భగ్గుమంటున్నారు. పవన్ కల్యాణ్‌ని విమర్శించడానికి అంబటికి విలువ లేదని, కాపులను జగన్ కాళ్ల కింద నెట్టాడని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇక బండ్ల గణేశ్ తన మార్క్ పంచులతో ఓ ట్వీట్ వదిలారు. ‘‘అలాగే రంభల రాంబాబు గారు మాసారు త్వరలో మీకు సమాధానం చెబుతారు ... జై పవన్ కల్యాణ్ ’’అని పేర్కొన్నారు. 


Scroll to load tweet…