పవన్‌తో నాదెండ్ల భేటీ: రేపే జనసేనలోకి (వీడియో)

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 11, Oct 2018, 5:26 PM IST
nadendla manohar meets pawan kalyan
Highlights

 మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు  నాదెండ్ల మనోహర్  గురువారం నాడు సాయంత్రం తిరుపతిలో కలిశారు.  శుక్రవారం నాడు  మనోహర్  జనసేనలో చేరనున్నారు.


తిరుపతి: మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు  నాదెండ్ల మనోహర్  గురువారం నాడు సాయంత్రం తిరుపతిలో కలిశారు.  శుక్రవారం నాడు  మనోహర్  జనసేనలో చేరనున్నారు.

కొంతకాలం నుండి  కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు నాదెండ్ల మనోహర్ దూరంగా ఉంటున్నారు.  రాహుల్‌గాంధీతో కూడ మనోహర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.  అయితే ఎఐసీసీ ఇటీవల ప్రకటించిన జాబితాలో మనోహర్ కు స్థానం దక్కలేదు.

"

దీనికి తోడు రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గురువారం నాడు  కాంగ్రెస్  పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు.

నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్‌ను తిరుపతిలో కలిశారు. పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్  ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకొన్నారు. విమానాశ్రయంలో పవన్‌తో నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మనోహర్  జనసేనలో చేరనున్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ చిట్టచివరి స్పీకర్‌గా మనోహర్‌ కు రికార్డులకెక్కాడు. మనోహర్ స్పీకర్ గా ఉన్న కాలంలోనే ఏపీ పునర్విభజన బిల్లుపై చర్చ జరిగింది.
 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు షాక్: జనసేనలోకి నాదెండ్ల మనోహర్

loader