Asianet News TeluguAsianet News Telugu

నాదెండ్ల మనోహర్: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Nadendla Manohar Biography: రాజకీయంగా పేరు ఉన్న కుటుంబంలో జన్మించారు. తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా సేవలందించారు. ఆ తరువాత జనసేనలో చేరి పవన్ కు కుడి భుజంగా మారారు.  పార్టీ వ్యవహారాల్లో పవన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న నాయకుడు. ఆయననే నాదెండ్ల మనోహర్.  రాజకీయాల్లో వివాదరహితుడు,విద్యావంతుడైన పొలిటికల్ జెంటిల్ మెన్ నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకుందాం.

Nadendla Manohar Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 22, 2024, 12:21 PM IST

Nadendla Manohar Biography: నాదెండ్ల మనోహర్.. జనసేనకు అండగా నిలిచిన నేతల్లో ఒకరు. ఎంతలా అంటే.. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టు ఆయనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆటగాడిగా నేషనల్ లెవల్.. రాజకీయాల్లో స్టేట్ లెవెల్ పొలిటికల్ లీడర్ ఎదిగారు. 

బాల్యం, విద్యాభ్యాసం

నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ 6 1964న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆయన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే సాగింది. నాదెండ్ల మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆయన చదువుల్లోనే కాదు.. ఆటల్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయన  జాతీయస్థాయి టెన్నిస్ ఆటగాడు. దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నారు. ఆయన 1986 నేషనల్ గేమ్స్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించాడు.

 

రాజకీయ జీవితం

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరించారు. ఇలా  తొలిసారి 2004లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇలా మొదటి సారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2009లో  కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇలా  2004, 2009 వరుసగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యే అయిన తరువాత తెనాలి నగరాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలని చెప్పాలి. నగర అభివృద్ధి కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడి తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించుకున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాదెండ్ల మనోహర్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ 

ఆయన 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్‌లో శాసనసభ స్పీకర్‌గా నియమితుడయ్యారు. ఇలా 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా పని చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో NSUI, యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టిసారించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వి‌భజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేశారు కానీ, ఓడిపోయాడు. 

జనసేనలో చేరిక 
 
నాదేండ్ల మనోహర్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీలో గానీ, టీడీపీలో గానీ చేరుతారని అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ గా నాదెండ్ల ముందుకు సాగుతున్నారు. జనసేనకి అండగా నిలిచిన నేతల్లో నాదెండ్ల ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే జనసేనలో పవన్ తరువాత నాదెండ్లనే సెకండ్ అని చెప్పాలి. ఆయన అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పవన్ కూడా ఆయన కు ఆయనకు అంతలా ప్రయారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన అభివృద్ధిగా బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు 

Follow Us:
Download App:
  • android
  • ios