ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తనను నెగిటివ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు హెచ్చరించారు. 


హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తనను నెగిటివ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు హెచ్చరించారు.

శుక్రవారం నాడు ఆయన నాదెండ్లభాస్కర్ రావు ఈ విషయమై స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఎన్టీఆర్ బయోపిక్ సినిమా యూనిట్ కు ఇప్పటికే రెండు దఫాలు నోటీసులు జారీచేసినట్టు చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ లో తన పాత్రను నెగిటివ్ గా ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తనను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేయడం సహజమని చెప్పారు. సినిమాలో ఎవరినో ఒకరిని అలా చూపడం సహజమని ఆయన చెప్పారు.సినిమాలో తన క్యారెక్టర్ విషయమై నెగిటివ్ గా చూపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ విషయమై తన పెద్ద కొడుకు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినట్టు నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు.

ఈ సినిమా నిర్మిస్తున్న నటుడు బాలకృష్ణ,దర్శకుడు క్రిష్ కు కూడ నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు. సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.తనను నెగిటివ్ గా చూపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని భాస్కర్ రావు చెప్పారు.