కడప: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ లు రాయలసీమపై వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఆరోపించారు.  
రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్మోహన్ రెడ్డిలతో కలిసి జగన్, చంద్రబాబులకు లేఖలు రాశారు.  

నీటి పంపకాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనే అని చెప్పారు. జగన్, చంద్రబాబులిద్దరూ రాయలసీమపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. 

ఏపీ రాజధాని, హైకోర్టు ఒకేచోట నిర్మించి రాయలసీమకు అన్యాయం చేశారని విమర్శించారు. నదీజలాల పంపకాల విషయంలో సీమ ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. రాలయసీమకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో జగన్ పోరాడకపోవడం దురదృష్టకరమని మైసూరారెడ్డి అన్నారు. 

ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో రాయలసీమకు ఏం చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తెలిపారు.