ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి కాల్చి చంపిన కేసులో మిస్టరీ వీడింది. అక్రమసంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తేలింది.
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు-నంద్యాల రోడ్ లో కాలిన మృతదేహం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. తాడివారిపల్లె చెక్ పోస్ట్ సమీపంలో ఓ మృతదేహం కాలిన స్థితలో దొరికింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన యువకుడు బత్తుల దేవధరణి(22)గా గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తేలింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఈ మేరకు పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పొదిలి సర్కిల్ కార్యాలయంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మృతుడు బత్తుల దేవధరణి. చిన్నప్పటినుంచి చెడు వ్యసనాలకు బానిస్యాడు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామవాసి. ఆకతాయిగా తిరుగుతూ.. మహిళలకు అసభ్యంగా ఫోన్లు చేయడం..లాంటి పనులు చేస్తుండేవాడు. దీంతో దేవధరణి అన్న పవన్ సాయి తమ్ముడిని తన దగ్గరికి విశాఖపట్నం తీసుకుని వెళ్లి పెట్టుకున్నాడు.
తెలుగుదేశం పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ?.. భవిష్యత్తు కార్యచరణపై క్లారిటీకి వచ్చేసినట్టేనా..!
అక్కడే తన దగ్గరే పెట్టుకుని ఇంటర్ వరకు చదివించాడు. ఆ తరువాత ఖాళీగా ఉంచకుండా ఓ రెస్టారెంట్లో పనికి పెట్టాడు. అయితే ఇంత చేసినా దేవధరణి లో మార్పు రాలేదు. పని చేయడం మానేసి సోషల్ మీడియాలో ఛాటింగులతో టైం వేస్ట్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతనికి గంగా అనే యువతి పరిచయం అయ్యింది. చాటింగ్ తో మొదలుపెట్టి... అది ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే, గంగకు దేవధరణి కంటే ముందే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది.
ఈ విషయం తెలియడంతో ప్రవీణ్ కుమార్, దేవధరణిల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది దేవధరణి అన్న పవన్ సాయి వారి మధ్య రాజీ కుదిర్చాడు. దీంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.. కానీ దేవధరణి మాత్రం గంగతో చాటింగ్ చేయడం మానలేదు. అది ప్రవీణ్ కుమార్ కు నచ్చలేదు. అతడిని హత్య చేయాలనుకున్నాడు. అందుకే అహోబిలం వెళ్లడానికి అని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు.
మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరిణితో మాట్లాడించి, నమ్మించి కారు ఎక్కేలా చేశారు. ఆ తరువాత మార్గమధ్యంలో క్లోరోఫామ్ ఇచ్చారు. దీంతో మత్తులోకి వెళ్లిన దేవధరణి కారులోనే మలవిసర్జన చేశాడు. దీంతో ఘాట్ రోడ్డులో కారు అపేశారు. అతడిని కిందికి దించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. కత్తితో గొంతు కోసి చంపారు. ఆ తరువాత పెట్రోల్ పోసి కాల్చేశారు.
కాగా, తమ్ముడు కనిపించకపోవడంతో పవన్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. కారు డ్రైవర్ శివకిరణ్ ను అరెస్ట్ చేయగా అసలు నేరస్తులు గురించి వివరాలు తెలిశాయి.
