ఫోన్ కాల్ డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్య మిస్టరీ చిక్కుముడి వీడుతోంది అని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వారితో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. విద్యా దీవెన కు సంబంధించిన పని ఉందని కళ్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెళ్తున్నా.. అని చెప్పి బయలుదేరింది.
కడప : kadapa రైల్వే స్టేషన్ పరిధి భాకరాపేట సమీపంలో సోమవారం రైలు పట్టాలపై పూజిత (19), కళ్యాణి (19) suicideకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు.. అనేది mysteryగా మారింది. వీరిద్దరు ప్రాణస్నేహితులు అనే విషయం చనిపోయేంతవరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. studiesలో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు లేవు. కడపకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా వీరిని భయపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
phone call data వివరాలు తెలిస్తే ఆత్మహత్య మిస్టరీ చిక్కుముడి వీడుతోంది అని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వారితో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. విద్యా దీవెన కు సంబంధించిన పని ఉందని కళ్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెళ్తున్నా.. అని చెప్పి బయలుదేరింది.
పూజిత కళాశాలకు వెళుతున్నానని చెప్పి వచ్చింది. వీరిద్దరూ తాడిపత్రిలో సోమవారం ఉదయం 9 గంటల 42 నిమిషాలకు కర్ణాటక బస్సు ఎక్కి కడపలో దిగారు. కడప బస్టాండ్ లో దిగిన తర్వాత ఇద్దరూ సంతోషంగా సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్లారు. ఒకటిన్నర గంటలకు రైల్వే స్టేషన్ లో తిరిగినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇటువైపు రాకూడదు.. అని చెప్పడంతో అక్కడి నుంచి ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు.
పట్టాలపై నడుచుకుంటూ వస్తూ ఉండడం గూడ్స్ రైలు డ్రైవర్ చూసి వేగాన్ని తగ్గించడంతో వారు పట్టాలు దిగారు. తర్వాత గూడ్స్ రైలు దగ్గరికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా రైలు పట్టాలపై పడ్డారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వీరిద్దరి మృతికి కారణాలు తెలియవని, సొంతూరికి వెళ్లాల్సిన కళ్యాణి కడపకు ఎందుకు వచ్చిందో తెలియదు అని కళ్యాణి బాబాయ్ బలరాం పేర్కొన్నాడు.
‘పూజిత గత రెండు నెలల నుంచి ఒంటరి తనానికి గురవుతుండేది. ఇంటి వద్ద ఎలాంటి గొడవలు లేవు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు. కళ్యాణి, పూజిత స్నేహితుడు అనే విషయం ఇప్పటివరకు మాకు తెలియదు’ అని పూజిత సోదరుడు నాగార్జున్ తెలిపారు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. తమ సిబ్బందిని తాడిపత్రికి పంపించి వీరు చదివే కళాశాలలో విచారణ చేయిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నాం’ అని కడప రైల్వే ఎస్ఐ రారాజు పేర్కొన్నారు.
కాగా, జనవరి 31 సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద దూకి ఇద్దరు యువతులు బలవన్మరణం చెందారు. రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడటంతో.. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతులను అనంతపురం జిల్లా యాడికి చెందిన కల్యాణి (18), పూజితగా (18) గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారా..?, ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆ రోజు దర్యాప్తు ప్రారంభించారు.
