Asianet News TeluguAsianet News Telugu

నా ఆరోగ్యం కుదుటపడుతోంది: పవన్ కళ్యాణ్

తన ఆరోగ్యం కుదుటపడుతోందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ శివారల్లోని తన ఫాం హౌస్ లో  పవన్ కళ్యాణ్   హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు.  

my health condition is stable:Pawan kalyan lns
Author
Guntur, First Published Apr 18, 2021, 3:56 PM IST

హైదరాబాద్: తన ఆరోగ్యం కుదుటపడుతోందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ శివారల్లోని తన ఫాం హౌస్ లో  పవన్ కళ్యాణ్   హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు.  పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో  ముందుజాగ్రత్తగా ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు. అయితే  రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించుకోవడంతో కరోనా సోకినట్టుగా తేలింది. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

also read:పవన్‌కు కల్యాణ్‌కు కరోనా: అధినేత కోలుకోవాలంటూ జనసైనికుల చండీ హోమం

వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తున్నానని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా కోలుకోని మీ ముందుకు వస్తానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తన ఆరోగగ్యం కోసం పూజలు చేయడంతో పాటు కోరుకొన్నవారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఏపీలో కరోనా ఉధృతి ఆందోళన కల్గిస్తోందన్నారు.  ఈ విషయమై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొంటున్నట్టుగా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో కేసులు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు  ప్రభుత్వాలు  మరింత సన్నద్దతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.కరోనా మరణాలు తగ్గేలా చూడాలని ఆయన కోరారు.

ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడడం దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు.వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లాడు. క్వారంటైన్ లోనే ఉంటూనే ఆయన తిరుపతి ఉప ఎన్నికల్లో పాల్గొన్న పార్టీ నేతలకు ఆయన దిశా నిర్ధేశం చేశారు. 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరుిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడ కరోనా విషయంలో అప్రమతంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios