విజయవాడలో హెల్మెట్ వాడకం తప్పనిసరి. లేకపోతే లైసెన్స్ రద్దు.

విజ‌య‌వాడ న‌గ‌రంలో జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు అరిక‌ట్టేందుకు రంగంలోకి దిగారు ట్రాఫిక్ పోలీసులు. ప్ర‌మాదాలకు గురయ్యే వారిలో అత్య‌ధికులు ద్విచ‌క్ర‌వాహాన‌దారులే. అందుకనే ప్రమాదాల నివారణకు శుక్రవారం నుండి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశారు. 

ఇదేవిష‌యంపై డీసీపీ కాంతిరాణా మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను కచ్చితంగా ధరించాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. హెల్మెట్ లేకుండా మొదటిసారి దొరికితే రూ. 100 జరిమానా విధించి వదిలేస్తామని చెప్పారు. మళ్లీ మళ్లీ హెల్మెట్ లేకుండా దొరికితే జరిమానా పెరుగుతుంది. దీనికితోడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని తెలిపారు.

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి...